Saturday, April 25, 2015

ఉల్లికాడలలో ఆరోగ్య ప్రయోజనాలు

గుండెకు మంచిది : ఉల్లికాడలు గుండె, రక్తనాళాలకు మంచిది. ఇది కొలెస్ట్రాల్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ ని మెరుగుపరుస్తుంది : ఈ కూరగాయలోని సల్ఫర్ కాంపౌండ్ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను నియంత్రి౦చడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ స్థాయిలు : ఉల్లికాడలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడతాయి.

మధుమేహం : ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది.

జలుబు, జ్వరం : దీనిలో ఉన్న యాంటీ-బాక్టీరియల్ లక్షణం జలుబు, జ్వరానికి వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది.

అరుగుదల పెరుగుతుంది : అసౌకర్య అరుగుదల నుండి ఉపశమనానికి యాంటి బాక్టీరియల్ లక్షణాలను కూడా అందిస్తుంది.

వ్యాధినిరోధక శక్తి : ఈ కూరగాయలోని విటమిన్ C వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది.

పెద్దప్రేగు కాన్సర్ : ఉల్లికాడలలో పెక్టిన్ (నీటిలో కరిగే కొల్లాయిడల్ కార్బోహైడ్రేట్) ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ అభివృద్ది అవకాశాలను తగ్గిస్తుంది.

కీళ్ళనొప్పులు, ఉబ్బసం : ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు మంచి కూరగాయ.

జీవక్రియ : స్ధూలపోషకాలు ఉండడం వల్ల ఇది జీవక్రియ నియంత్రణకు మంచి ఆహారం.

కళ్ళు :
ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి.

ముడతలను తొలగిస్తుంది : కూరగాయలలోని అల్లసిన్ చర్మానికి మంచిది, ఇది చర్మం ముడతల నుండి రక్షిస్తుంది

తేనె సహజ ఔషధ గుణములు

  • తేనే సూక్ష్మజీవుల సంహారిణి, బ్యాక్టీరియా, ఈస్ట్ ‌‌, మోల్ట్స్  వంటి వాటిని ఎదగనివ్వదు.
  • ఇందులోని కార్బోహైడ్రేట్‌లు తక్షణ శక్తిని ఇస్తాయి.
  • చిన్న చిన్న గా యాలు, చర్మ ఇబ్బందులు తేనే విరుగుడుగా పనిచేస్తుంది.
  • గొంతులో గరగరలను తగ్గిస్తుంది. .  నిమ్మ రసము తో కలిపి దగ్గు , గొంతు నొప్పులకు బాగా పనిచేయును ,
  • తేనేలో కార్బోహైడ్రేట్‌లు, నీరు, మినరల్‌‌స , విటమిన్‌‌స వుంటాయి. కాల్షియమ్‌, మాంగనీస్‌, పోటాషియమ్‌,ఫాస్ఫరస్‌, జింక్‌, విటమిన్‌ ఎ, బి,సి,డి తేనేలో లభిస్తాయి.
  • తేనేను క్రమం తప్పకుండా తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలను అడ్డుకుంటుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.
  • కీళ్ళనోప్పులు బాధిస్తుంటే ఒక వంతు తేనే, రెండు వంతుల నీరు, ఒక చెంచా దాల్చిన చెక్క పోడి తీసుకొండి. ఆమిశ్రమాన్ని కలిపి ముద్ద చేసి బాధిం చే భాగం మీద మర్ధన చేస్తే మర్ధన చేసిన రెండు మూడు నిమిషాలలోనే ఉపశమనం కలుగుతుంది.
  • రెండు స్పూన్ల తేనేలో దాల్చిన చెక్క పొడి కలుపుకుని ఆహారం తీసుకునే ముందు తీసుకుంటే ఎసిడిటీ బాధ తొలిగి, జీర్ణం సులభం చేస్తుంది.
  • తేనే ,దాల్చిన చెక్క పొడిని బ్రెడ్‌ మీద పరుచుకుని తింటే కొలెస్టరాల్‌ తగ్గుతుంది.
  • రోజుకు మూడు పూటలా తీసుకుంటే క్యాన్సర్‌ రానివ్వదు.
  • వేడినీటిలో ఒక స్పూన్‌ తేనే, దాల్చిన చెక్క పొడి వేసి ఆ నీటితో కొద్దిసేపు పుక్కిలించి ఉమ్మేస్తే నోటి దుర్వాసన సమస్య మాయవుతుంది.
  •     తేనే లో ఉన్నా విటమిన్స్... శరీర వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిన్చును,   
  •     యాన్తి బ్యాక్తెరియాల్ , యాన్తి సెప్టిక్ గునాలున్నందున చర్మము పై పూసిన ,.. గాయాలు మానును .
  •     తేనే ... వెనిగర్ తో కలిపి 'vermifuge ' గా వాడుదురు .
  •     రోజూ 1/4 గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో రెండు చెంచాల తేనే కలుపుకు త్రాగితే ఒళ్ళు తగ్గుతుంది .
  •     రాత్రిళ్ళు పాలు తేనే కలుపుకొనే త్రాగితే చక్కటి నిద్ర వస్తూన్ది .
  •     నిమం రసం లో తేనే కలుపుకొని తీసుకుంటే కడుపు ఉబ్బరం , ఆయాసము తగ్గుతుంది .
  •     తేనే లో కొచెం మిరియాలపొడి కలుపుకొని తీసుకుంటే జలుబు తగ్గుతుంది .
  •     రెండు చెంచాల తేనే లో కోడిగుడ్డు లోని తెల్లనిసోన , కొంచం శనగపిండి కలుపుకొని ముఖంనికి మర్దన చేసుకుంటే చర్మపు కాంతి పెరుగుతుంది .
  •     తేనే లో పసుపు , వేపాకు పొడి కలిపి రాస్తే పుల్లు మానుతాయి .
Source: http://food-health-disease.blogspot.in

అలసటను దూరము చేసే ఆహారము :

శారీరకముగా , మానసికముగా బాగా శ్రమచేసినప్పుడు అలసట అనిపిస్తుంది.అలుపు , మత్తు , నిద్రమత్తు , నిస్సతువ లాంటివన్నిటినీ  అలసటగా పేర్కొంటారు . అలసట కలగడానికి శారీరకంగా లేదా మానసికంగా శ్రమ కారణమవుతుంది.మన ఆరోగ్యము పట్ల శ్రద్దచూపినట్లైతే శరీరానికి అవసరమైన పోషక పదార్ధాలు ఏమిటో మనము తెలుసుకోవాలి . సరైన పోషకాలు శరీరానికి అందనప్పుడు కూడా అలసట అనిపిస్తుంది.

అలసటను అధికమించడానికి అవసరమైయ్యే ఆహారపదార్ధాలు - అలవాట్లు :

టిఫిన్‌ తప్పనిసరి -- ఉదయాన్నే కడుపు ఖాలీ గా ఉండడము వలన మనము తప్పనిసరిగా శక్తినిచ్చే గ్లూకోజ , పోషకాలు , కార్బోహైడ్రేట్స్ ఉంటే టిఫిన్‌ తినాలి .

లంచ్ లో ఉండాల్సినవి : మధ్యాహ్నం పూట శక్తి , చురుకుదనము కోసము కార్బోహడ్రేట్సు , ప్రోటీన్లు వున్న ఆహారము తీసుకోవాలి. చురుకుదనాన్ని , మానసిక కేంద్రీకరణను పెంచే న్యూరోట్రాన్సుమీటర్ల కోసము పోటీన్లు పుష్కరముగా లభించే ఆహారము తప్పనిసరిగా తీసుకోవాలి .

ఎక్కువ నీరు త్రాగాలి : శరీరములో తగినంత నీరు లేకపోతే పని సామర్ధ్యము తగ్గిపోతుంది. శరీరము లో నీరు తగ్గిపోవడము వల్ల అన్ని అవయవాలకు రక్తప్రసరణ తగ్గిపోయి మెదడు పనితనము నెమ్మదిస్తుంది. అందువల్ల ప్రతిరోజూ 8 గ్లాసులు (1600 -2000 మిల్లీలీటర్ల ) నీరు తాగాలి. దప్పిక అయ్యేవరకు ఆగకూడదు.

ఉపవాసాలు , విందులు వద్దు : బోలెడన్ని పదార్ధాలతో మితిమీరి కేలరీలు అభించే ఆహారము తీసుకోవద్దు .దీనివలన తీవ్రమైన ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. వయసు , స్త్రీ-పురుష బేధము , బరువు , చేసేపని ... ఆధారముగా పోషకవిలువలు గల ఆహారము అవసరము . బోజనము మానివేయవద్దు . మానేస్తే రక్తము లో చెక్కెర శాతము తగ్గి అలసట వస్తుంది. శరీరానికి కావసైన శక్తినిచ్చే తగినన్ని కార్బోహడ్రేట్స్ లేని రకరకాల ఆకర్షనీయమైన చిరుతిండ్లు పనికిరావు . . . వీటిలో విటమిన్లు ఉండవు . పోషకవిలువలు లేని ఆహారపదార్దములు అలసటకు దారితీస్తాయి.

ఐరన్‌ ఎక్కువగా ఉంటే మేలు : శరీరములోని వివిధ అవయవాలకు రక్తము ద్వారా ఆక్షిజన్‌ బాగా సరఫరా కావడానికి ఐరన్‌ దోహదము చేస్తుంది.ఐరన్‌ శరీరానికి సరిపడినంత లభించకపోతే అలసటకు దానితీస్తుంది. ఒకవేళ రక్తహీనత లేకపోయినా ఐరన్‌ శాతము తక్కువగా ఉన్నట్లైతే అలసటకు , మనోవ్యాకులతకు దారితీస్తుంది.

కెఫిన్‌ తో జాగ్రత్త : రోజులో కెఫిన్‌ వున్న కాఫీ , టీ , కోలా లాంటి డ్రింక్సు ఒకటి .. రెండు సాలు తాగినట్లయితే శరీరములో శక్తి పెరుగుతుంది . చురుకుదనము వస్తుంది . అలా కాకుండా రోజులో 5-6 సార్లు మించి కెఫినేటెడ్  ద్రవపదార్ధాలు తీసుకున్నట్లయితే అది ఆందోళనకు , చికాకు కలగడానికి , శారీరక సామర్ధ్యము తగ్గిపోవడానికి దారితీస్తుంది.

యోగర్ట్ : దీర్ఘకాలికంగా అలసటకు గురవడానికి ముఖ్యకారణము జీర్ణక్రయ జరిగే మార్గములో మైక్రో-ఆర్గానిజమ్స్ అసమతుల్యముగా ఉండడమే. రోజులో 200 మి.లీ. యోగర్ట్ (పెరుగు/మజ్జిక ) రెండు సార్లు తీసుకుంటే అలసట లక్షణాలు తగ్గుతాయి.

విటమిన్‌ సి : యాంటి ఆక్షిడెంట్ గా పనిచేసే విటమిన్‌ ' సి ' ఉన్న ఆహార-పానీయాలు తీసుకుండే శరీరానికి మంచిది , వ్యాదినిరోధక శక్తిని పెంచుతుంది. . రక్తకణాలు తయారీకి , ఫ్రీరాడికల్స్ పారద్రోళి అలసటను తగ్గిస్తుంది. శరీరానికి అన్ని విటమిన్లు అవసరమే అందుకే మల్టీవిటమున్‌ మాత్రలు రోజూ ఒకటి డాక్టర్ల సలహా తో తీసుకోవాలి .

Source: http://food-health-disease.blogspot.in

ఉలవలు - Horse gram

రపంచములో అత్యంత ప్రాచీన ధాన్యము ఉలవలు . దక్షిణాదిలో నూ , ఉత్తరాది కొన్ని గ్రామాలలోనూ ఇప్పటికీ ఇది పాపుల పంట .ఉలవలలో పోటీన్లు , ఐరన్‌ , కార్భోహైడ్రేట్స్ , కాల్సియం , ఫాస్పరస్ , ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. చెక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడములోనూ , రక్తపోటు నియంత్రించడములోనూ ఉలవలు ఉపకరిస్తాయి.

ఉలవలు:- Dolichos Uniflorus, Dolichos Biflorus. Eng. Horse gram. సం. కుళుత్ధ, తామ్రబీజ, హిం. కుల్తీ. ఇవి తెలుపు ఎరుపు, నలుపు రంగులుగల మూడు జాతులుగ నుండును. ఉలవలు నవధాన్యాలలో ఒకటి.

 ఉలవయొక్క కషాయము గాని లేక చూర్ణము గాని, వగరుగ, తీపిగ స్వాదుగనుండును. మూలవ్యాధి, మూత్రకృఛ్రము, ఊపిరిగొట్టునొప్పి, మలబద్ధము వీనిని హరించును; కఫమును లేక శ్లేష్మమును కరిగించును అనగా నీరుజేయును; స్త్రీలు బహిష్టు కావడములోని లోపములను (menstural disorders)పోగొట్టును; ప్రసవ స్త్రీల మైలరక్తమును వెడలించును. గురదాల లోని రాతిని కరిగించును;ఆకలి బుట్టించును; ఎక్కిళ్ళు, నేత్రరోగములు  నణచును;

*ఉలవల్లో ప్రోటీన్ ఎక్కువ. పెరిగే పిల్లలకు మంచి టానిక్. ఉలవల్లో ఐరన్, మాలిబ్డినం వంటి ఖనిజ సంబంధ పదార్థాలూ ఎక్కువే. పొట్టు తొలగించటం, మొలకెత్తించటం, ఉడికించటం, వేయించటం వంటివి చేయడం ద్వారా ఉలవల్లోని పోషకతత్వాలు గణనీయంగా పెరుగుతాయి.
* ఉలవలు ఆకలిని పెంచుతాయి. కఫాన్ని పల్చగా మార్చి వెలుపలకు తెస్తాయి. కళ్లు కన్నీరు కారటం, కళ్లలో పుసులు కట్టడం వంటి సమస్యల్లో వాడవచ్చు.
* మూత్రాశయంలో తయారయ్యే రాళ్లను కరిగించి వెలుపలకు రావడానికి ఉలవలు సహకరిస్తాయి. తరచూ ఎక్కిళ్లు వస్తుంటే ఉలవలు తగ్గిస్తాయి.
* ఉలవలను తీసుకోవటంవల్ల మలనిర్హరణ సజావుగా, సాఫీగా జరుగుతుంది. ఉలవలను ఆహారంలో వాడేవారికి మూత్ర విసర్జన ధారాళంగా, నిరాటంకంగా జరుగుతుంది. మహిళల్లో బహిష్టురక్తం కష్టం లేకుండా విడుదలవుతుంది. ఉలవలు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి సైతం హితం చేస్తాయి.
* ఉలవలను ఆహార రూపంలో తీసుకుంటే స్థూలకాయం తగ్గుతుంది. ముందుగా ఒక కప్పు ఉలవలకు నాలుగుకప్పులు నీళ్లు కలిపి కుక్కర్‌లో ఉడికించాలి. ఇలా తయారుచేసుకున్న ‘ఉలవకట్టు’ను ప్రతిరోజూ ఉదయంపూట ఖాళీ కడుపుతో, చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటూ ఉంటే క్రమంగా సన్నబడతారు. *ఉలవలు తీసుకునే సమయంలో శరీరంలో మంటగా అనిపిస్తుంటే మజ్జిగ తాగితే సరిపోతుంది.
*బోదకాలు, కాళ్లవాపు- ఉలవల పిండినీ, పుట్టమన్నునూ ఒక్కోటి పిడికెడు చొప్పున తీసుకొని సమంగా కలపాలి. దీనికి కోడిగుడ్డు తెల్లసొనను కలిపి స్థానికంగా లేపనంచేస్తే హితకరంగా ఉంటుంది.
*లైంగిక స్తబ్ధత: ఉలవలను, కొత్త బియ్యాన్నీ సమంగా తీసుకొని జావమాదిరిగా తయారుచేయాలి. దీనిని పాలతో కలిపి కొన్ని వారాలపాటు క్రమంతప్పకుండా తీసుకుంటే లైంగిక శక్తి, శృంగారానురక్తి పెరుగుతాయి. దీనిని వాడే సమయంలో మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.
*కాళ్లు, చేతుల్లో వాపులు, నొప్పి: ఉలవలను ఒక పిడికెడు తీసుకొని పెనంమీద వేయించి మందపాటి గుడ్డలో మూటకట్టి నొప్పిగా ఉన్న భాగంలో కాపడం పెట్టుకోవాలి. శరీరంలో వ్రణాలు (అల్సర్లు) తయారవటం: పావు కప్పు ఉలవలను, చిటికెడు పొంగించిన ఇంగువను, పావు టీస్పూన్ అల్లం ముద్దను, పాపు టీ స్పూన్ అతిమధురం వేరు చూర్ణాన్నీ తగినంత నీటిని కలిపి ఉడికించాలి. దీనికి తేనె కలిపి కనీసం నెలరోజులపాటు తీసుకుంటే బాహ్యంగా, అభ్యంతరంగా తయారైన వ్రణాలు (అల్సర్లు) త్వరితగతిన తగ్గుతాయి.
*మూత్రంలో చురుకు, మంట:ఒక కప్పు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే మూత్రంలో మంట తగ్గుతుంది. మూత్రం జారీ అవుతుంది. మధుమేహం: మూత్రంలో చక్కెర కనిపిస్తున్నప్పుడు ఉలవల కషాయంలో వెంపరి (శరపుంఖ) చెట్టు చూర్ణాన్ని, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది.
*సెగగడ్డలు: ఉలవ ఆకులను మెత్తగా నూరి, కొద్దిగా పసుపుపొడి కలిపి పై పూత మందుగా రాస్తే చర్మంమీద తయారైన సెగ గడ్డలు పగిలి, నొప్పి, అసౌకర్యం తగ్గుతాయి.

మూలము : వికీపెడియా .

బడి పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్తలు

ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు, కొవ్వు, పిండి పదార్ధాల్లాంటివి అన్నీ ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. బడి పిల్లల ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటే...వారి ఆరోగ్యం బాగుంటుంది...చదువూ సాఫీగా సాగుతుంది.

ప్రొటీన్స్‌, కార్భోహైడ్రెడ్స్‌...
విద్యార్ధుల్లో శరీర పెరుగుదలకు ప్రొటీన్స్‌ ఎంతో ముఖ్యమైనవి. రోగ నిరోధక శక్తిని కూడా ప్రొటీన్స్‌ పెంచుతాయి. గాయాలు తగిలినా ప్రొటీన్స్‌ ఎక్కువగా ఉండడం వలన త్వరగా తగ్గుతాయి. కోడిగుడ్లు, పప్పు దినుసులు, మొలకెత్తే విత్తనాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇక కార్భోహైడ్రెడ్స్‌ అంటే పిండి పదార్ధాలు. ఇవి శక్తినిస్తాయి. జీవనశైలికి శక్తి ఎంతో అవసరం. పిండి పదార్ధాలు విద్యార్ధులకు గ్లూకోజ్‌లా పనిచేస్తాయి. చిరు ధాన్యాలు, బియ్యం, గోధుమలు, రాగులు తదితర వాటి వల్ల ఇవి సమృద్దిగా లభిస్తాయి.

కొవ్వు పదార్ధాలు...
కొవ్వు పదార్ధాలతో విద్యార్ధులకు ఎంతో మేలు జరుగుతుంది. శరీరంతో పాటు లోపల ముఖ్య భాగాలైన మూత్రపిండాలు, గుండె లాంటి వాటికి రక్షణ కవచాల్లా ఉంటాయి. కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉన్నవారు వాతావరణంలో మార్పులు తట్టుకోలేకపోతారు. మాంసం, వెన్నె, నెయ్యి, పాలు, పల్లి నూనె, గింజలు తీసిన వంట నూనె శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కొవ్వు పెరిగి అది ఎముకలకు రక్షణగా నిలుస్తుంది.

గుడ్డు...
కోడి గుడ్డు పిల్లలకు ఎంతో ఆరోగ్య ప్రదాయిని. రోజుకు ఒక గుడ్డు చొప్పున కోడిగుడ్డు తినిపిస్తే వారి ఆరోగ్యానికి భరోసా లభించినట్లు అవుతుంది. కోడి గుడ్డులోని నీలం తినిపిస్తే పిల్లలకు కొవ్వు లభిస్తుంది. వంద శాతం పౌష్టికాహారం లభించేది గుడ్డులోనే అనే విషయం చాలా మందికి తెలియదు. 11రకాల ఆవ్లూలు గుడ్డులోనే లభిస్తాయి.

మినరల్స్‌...
మినరల్‌ తక్కువగా ఉండడంతో విద్యార్ధుల్లో ఎముకలు, దంతాల పెరుగుదల నిలిచిపోతుంది. రక్తస్రావం త్వరగా అదుపులోకి రాదు. నాడీ వ్యవస్థలో చైతన్యం కొల్పోతుంది. కండరాలు పని చేయవు. జీవక్రియ మెతకబడుతుంది. అలాగే ఐరన్‌ను రక్తంలో ఉండే ధాతువులు తక్కువ అయినా ప్రమాదమే. రక్తంను ఆక్సిజన్‌తో వివిధ భాగాలకు చేరవేయడానికి ఐరన్‌ కీలక భూమిక పోషిస్తుంది. శారీరక, మానసిక స్థిరత్వానికి మాంసం, కోడిగుడ్లు, చేపలు, పాలు, కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, రాగులు, కర్జూరా, బాదం, ఖాజు బాగా తినిపించాలి.

అయోడిన్‌...

అయోడిన్‌ లోపిస్తే అనారోగ్యం తప్పదు. థైరాయిడ్‌ హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అయోడిన్‌ తక్కువ అయితే జ్ఞాపక శక్తి తగ్గుతుంది. దీనితో విద్యార్ధులు చదువుతున్నప్పటికి వాటిని గుర్తుంచుకోలేకపోతారు. జింక్‌ కూడా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి పిల్లలకు చేపలు, రొయ్యలు, పండ్లు, కూరగాయలతో పాటు బాగా తినిపించాలి. ప్రభుత్వం కూడా అయోడిన్‌, ఐరన్‌ కలసిన ఉప్పును మార్కెట్‌లో లభిస్తుంది.

మొలకెత్తిన విత్తనాలు...
మొలకెత్తిన విత్తనాలు తినడం ఎంతో మంచిది. వీటిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసర్లు, శెనగలు, రాగులు, బబ్బర్లు, పల్లిdలు, కర్జూరా. వీటిని రాత్రి తడిగుడ్డలో చుట్టి ఉంచాలి. తెల్లవారేసారికి మొలకలు వస్తాయి. వాటిని ప్రతి రోజు పిల్లలకు తినిపించాలి. విటమిన్లు, పోషక పదార్ధాలు లభిస్తాయి. మార్కెట్లోనూ దొరుకుతాయి.

పిల్లలపై ప్రభావం:
- ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, విటమిన్ల లోపంతో విద్యార్ధులపై అనేక ప్రభావం చూపుతుంది.
- విద్యార్ధుల్లో తొందరగా అలసట రావడం.
- చదువులో వెనకబడడం.
- జ్ఞాపకశక్తి తగ్గడం.
- రోగనిరోధకశక్తి తగ్గిపోతుంది.
- వ్యాధులు ఎప్పుడు వస్తాయి.
- దృష్టి లోపాలు వస్తాయి.
- దంతాలు, ఎముకల సమస్యలు.
- పుస్తకాల బ్యాగులు మోయలేకపోవడం.
- చురుగ్గా ఉండకపోవడం.
- క్రీడలపై నిరాసక్తి.

Source: http://food-health-disease.blogspot.in

గ్రీన్ ఆపిల్: ఆరోగ్య ప్రయోజనాలు

రోజుకు ఒక ఆపిల్ తింటే వైద్యుడి అవసరం ఉండదు" అని ఒక సామెత ఉన్నది. అయితే ఖచ్చితంగా ఆకుపచ్చ ఆపిల్ లో ఈ వాస్తవం కలిగి ఉంది. ఆపిల్ అనేది మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. అత్యంత అసాధారణ మరియు అద్భుతమైన పండ్లలో ఒకటిగా ఉన్నది. ప్రతి వ్యక్తి తమ రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. దీనిలో అవసరమైన పోషకాలు మరియు చాలా విటమిన్లు ఉంటాయి. ఆపిల్స్ లో చాల రకాలు ఉన్నాయి. సాదారణంగా ఎరుపు మరియు ఆకుపచ్చ ఆపిల్స్ పుల్లని మరియు తియ్యటి రుచిని కలిగి ఉంటాయి.  గ్రీన్ యాపిల్ దీర్ఘ కాల ఆరోగ్యవంతమైన పండ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది అంతర్లీన ప్రోటీన్లు, విటమిన్లు,ఖనిజాలు మరియు ఫైబర్ వంటి అవసరమైన పోషకాలను కలిగి ఉంటుంది. జీర్ణవ్యవస్థ లోపాలు నుండి ఉపశమనం మరియు రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించటం,BP తగ్గించడం,రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడం & ఆకలి మెరుగుపరచడం వంటి వాటికీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

సూపర్ మర్కెట్ లో నేడు ప్రత్యేకం గా కనిపిస్తున్న పండ్లలో ఒకటి " గ్రీన్‌ యాపిల్ " సాధారణ యాపిల్ పండు రంగుకు భిన్నం గా కనిపించే  ఈ యాపిల్ పండును చూసిన చాలా మంది అది పచ్చి యాపిల్ గా భావించే అవకాశముంది. అయితే ఈ పచ్చ యాపిల్ పండుకు మన దేశములో లభించే యాపిల్ పండుకు సంబంధములేదు. లేత ఆకుపచ్చ రంగులో నిగనిగ లాడుతూ కనిపించే ఈ గ్రీన్‌ యాపిల్ ఆస్ట్రేలియా కు చెందిన యాపిల్ . పండ్ల అన్నింటా అత్యంత అధిక ఆరోగ్యాన్ని అందించే పండు గా దీనిని పేర్కొంటారు. ఇతర యాపిల్ పండుకు దీనికి జన్యుపరంగా అంతగా తేడాలు లేకపోయినా రుచి విషయము లో స్పస్టమైన తేడా ఉంది. సిమ్లా యాపిల్ పండులా గ్రీన్‌ యాపిల్ లో తియ్యదనము ఉండదు. కొంత వగరు రుచి కలిగి ఉంటుంది. ఈ రుచి వల్లనే దానికి ప్రత్యేకత సంతరించుకుందంటారు. . . వ్యాపారులు . సిమ్లా యాపిల్ కు గ్రీన్‌యాపిల్ కు ముఖ్యమైన తేడా దాని రంగు . యాపిల్స్ లో ఎరుపు , గ్రీన్‌ తరహావే కాక పసుపు రంగు యాపిల్స్ కూడా ఉంటాయి. వీటిలో దేని రుచి దానిదే.

గ్రీన్ ఆపిల్: ఆరోగ్య ప్రయోజనాలు

ఎక్కువ ఫైబర్ కంటెంట్ : దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండుట వల్ల జీర్ణవ్యవస్థను శుభ్రపర్చడానికి సహాయపడి తద్వారా జీవక్రియను పెంచుతుంది. అందువలన ఇది స్వేచ్ఛా ప్రేగు కదలికలో సహాయపడుతుంది. ఆపిల్ ను దాని చర్మంతో సహా తినటం ఎల్లప్పుడూ మంచిది. మీ ప్రేగు మరియు వ్యవస్థలను శుభ్రపర్చి మీరు సంతోషముగా మరియు ఆరోగ్యవంతులుగా ఉండటానికి సహయ పడుతుంది.

ఖనిజాల కంటెంట్ : ఇనుము,జింక్,రాగి,మాంగనీస్,పొటాషియం మొదలైన ఖనిజాలను కలిగి ఉంటుంది. మానవ ఆరోగ్యం మరియు శ్రేయస్సు ఖనిజాల మీద ఆదారపడి ఉంటుంది. ఆపిల్ లో ఉన్న ఇనుము రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెంచడంలో సహాయపడుతుంది. అంతేకాక జీవక్రియ రేటు పెంచటానికి సహాయపడుతుంది.

తక్కువ కొవ్వు కంటెంట్ : బరువు తగ్గాలని అనుకొనే వారికీ గొప్ప ఆహారం అని చెప్పవచ్చు. ప్రతి వ్యక్తీ తమ రోజు వారి ఆహారంలో తప్పనిసరిగా ఆపిల్ ఉండేలా చూసుకోవాలి. ఇది రక్తనాళాలలో కొవ్వును సేకరిస్తుంది. అంతేకాక స్ట్రోక్స్ అవకాశాలు నివారించడం,గుండెకు సరైన రక్త ప్రవాహం నిర్వహణలో సహాయపడుతుంది.

చర్మ క్యాన్సర్ నిరోధిస్తుంది : దీనిలో విటమిన్ C ఉండుటవల్ల ఫ్రీ రాడికల్స్ ద్వారా చర్మ కణాలకు వచ్చే నష్టాన్నినిరోధించడంలో సహాయపడుతుంది. అందువలన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

సమృద్ధిగా యాంటీ ఆక్సిడంట్ : యాంటీ ఆక్సిడంట్ లు కణాల పునర్నిర్మాణం మరియు కణాల పునరుత్తేజం నకు సహాయం చేస్తాయి. ఆరోగ్యకరమైన మరియు ప్రకాశించే చర్మ నిర్వహణలో కూడా సహాయపడతాయి. యాంటీ ఆక్సిడంట్ మీ కాలేయం రక్షించడానికి మరియు దాని యొక్క సరైన కార్యాచరణ నిర్ధారించడానికి సహయపడతాయి.

ఆరోగ్యకరమైన,బలమైన ఎముకలు : ఇది థైరాయిడ్ గ్రంథి సరైన కార్యాచరణకు సహాయం చేయడం ద్వారా కీళ్లవ్యాధులను నిరోధిస్తుంది.

 అల్జీమర్ నిరోధిస్తుంది : ప్రతి రోజు ఒక ఆపిల్ తింటే అల్జీమర్ వంటి వృద్ధాప్య నరాల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని అడ్డుకుంటుంది.

ఆస్త్మా నిరోధిస్తుంది : క్రమం తప్పకుండా ఆపిల్ రసం తీసుకుంటే తీవ్ర సున్నితత్వం కలిగిన అలెర్జీ రుగ్మత అయిన ఆస్త్మాని నిరోధించటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

డయాబెటిస్ నిరోధిస్తుంది : యాపిల్స్ మధుమేహంను నిరోధిస్తుంది. ఇది మధుమేహం కోసం తప్పక కలిగి ఉండాలి.సమృద్ధిగా విటమిన్ A,B మరియు C ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాల నుండి చర్మంను రక్షించటానికి గ్రీన్ ఆపిల్ లో విటమిన్లు A,B మరియు C సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక ప్రకాశించే చర్మం నిర్వహించడం కొరకు సహాయపడుతుంది.

మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడు : మహిళల్లో ఒత్తిడి శాతం పెరిగిపోయి అది క్రమంగా మైగ్రేన్‌ తలనొప్పిగా తయారయ్యే ప్రమాదం లేకపోలేదని వెైద్యులు చెబుతున్నారు. ఇప్పుడు అటువంటి మైగ్రేన్‌ తలనొప్పికి విరుగుడుగా ఆకుప చ్చని యాపిల్స్‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటిని తింటే మైగ్రేన్‌ తలనొప్పిని దూరం చేయవచ్చని వెైద్యు లు చెబుతున్నారు.


  •  గ్రీన్ ఆపిల్: స్కిన్ ప్రయోజనాలు :
గ్రీన్ ఆపిల్ ఒక అద్భుతమైన సౌందర్యాన్ని పెంచుతుంది. చర్మ సంరక్షణ మరియు జుట్టు సంరక్షణ ప్రయోజనాలు గ్రీన్ ఆపిల్ తో చాలా సంబంధం కలిగి ఉంటాయి.

  • చర్మ ఛాయను పెంపొందిస్తుంది గ్రీన్ ఆపిల్ లో విటమిన్ కంటెంట్ ఎక్కువగా ఉండుట వల్ల మీ చర్మం నిర్వహణలో సహాయపడుతుంది. మీ ఛాయతో మంచి తెల్లబడటం మరియు పెంచే ప్రభావాలను కలిగి ఉంటుంది. ముఖ్యమైన విటమిన్లు వలన  వివిధ రకాల చర్మవ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుంది.
మొటిమలను నివారిస్తుంది గ్రీన్ ఆపిల్ అత్యంత ప్రభావవంతమైన యాంటీ మోటిమలు చికిత్సకు సహయ పడుతుంది. గ్రీన్ ఆపిల్ యొక్క సాధారణ వినియోగం వలన మొటిమలను నిరోధిస్తుంది.

  • కళ్ళ ఆరోగ్యానికి-నల్లటి వలయాలను తగ్గిస్తుంది అదనంగా మీ కళ్ళు రిఫ్రెష్ మరియు డార్క్ వలయాలు తొలగింపునకు సులభతరం చేస్తుంది.
చుండ్రును నివారిస్తుంది: గ్రీన్ ఆపిల్ చర్మం కొరకు మాత్రమే కాకుండా జుట్టు కొరకు కూడా చాలా మంచి ప్రయోజనాలను కలిగి ఉంది.. గ్రీన్ ఆపిల్ ఆకులు మరియు దాని తొక్కతో కలిపి చేసిన పేస్ట్ చుండ్రును పరిష్కరించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీరు ఈ పేస్ట్ ను ఒక షాంపూ లాగ వాడాలి. గ్రీన్ ఆపిల్ రసంను కూడా జుట్టు లోకి క్రమం తప్పకుండా మసాజ్ చేస్తే చుండ్రు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది.
జుట్టు రాలడాన్ని అరకడుతుంది: పటిష్టమైన జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తూ జుట్టు నష్టం నిరోధించడానికి గుర్తించబడిన గొప్ప పరిష్కారం.


  • గ్రీన్ ఆపిల్ ఒక గొప్ప యాంటీ వృద్ధాప్య పదార్ధం. గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడంట్ మరియు ఫైబర్స్ దీర్ఘకాలం పాటు మీ చర్మంను స్థితిస్థాపక మరియు యవ్వనంగా ఉంచేందుకు సహయ పడతాయి. గ్రీన్ ఆపిల్ ఉపయోగించి మీ ముఖంనకు మాస్క్ వేసుకొంటే మీ చర్మానికి తేమ,మీ చర్మం యొక్క మొత్తం ఆకృతి అభివృద్ధి మరియు ముడుతలు తగ్గటానికి సహాయపడుతుంది.

ఆపిల్‌... ఔషధఫలం

ఆపిల్‌ పోషకాల గురించి మనకు తెలిసిందే. అయితే అందులోని ఔషధగుణాలవల్ల చాలా రకాల వ్యాధుల్ని నివారించవచ్చంటున్నాయి ఈ సరికొత్త పరిశోధనలు...
* రోజూ కనీసం ఓ ఆపిల్‌ తినేవాళ్లలో (తినని వాళ్లతో పోలిస్తే) మధుమేహం కూడా తక్కువే. ఆపిల్‌ని కొందరు తొక్క తీసి తింటారు. కానీ అందులోని ట్రిటర్‌పినాయిడ్లు కాలేయ, పేగు, రొమ్ము క్యాన్సర్ల కణాలు పెరగకుండా అడ్డుపడతాయి.
* ఆపిల్‌ జ్యూస్‌కి ఆల్జీమర్స్‌ని నిరోధించే శక్తి ఉంది. మెదడులోని ఎసిటైల్‌ కోలీన్‌ స్రావాన్ని పెంచడం ద్వారా న్యూరోట్రాన్స్‌మిటర్ల పనితీరుని మెరుగుపరుస్తుంది.

Source: http://food-health-disease.blogspot.in/

చర్మ సౌందర్యానికి ఆహారము

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. సాధారణంగా  మనం తీసుకునే ఆహారమే మన అందాన్ని, ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. మన శరీరానికి రక్షణ కవచమైన చర్మం మన ఆరోగ్య స్థితిని చెప్పకనే చెబుతుంది. పుట్టిన నాటి నుంచి మన శరీరంతో పాటు చర్మంలో కూడా ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. చిన్నపిల్లలప్పుడు లేత చర్మం పెద్దవాళ్లయ్యేప్పటికి పూర్తిగా మారిపోతుంది. ఇది ప్రకృతి సహజంగా జరిగే మార్పే అయినా సరైన ఆహారం, చక్కటి జీవనశైలి ద్వారా వృద్ధాప్యపు జాడలని మన దరికి చేరనీయకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు.

ముట్టుకుంటే గరుగ్గా... చూడటానికి కాంతిహీనంగా కనిపించే చర్మం సరైన పోషణ, సంరక్షణ లోపాన్ని ఎత్తి చూపుతుంది. అయితే అందంగా, ఆరోగ్యమైన చర్మం కోసం ఖరీదైన క్రీములు, ట్రీట్ మెంట్లు అవసరం అనుకుంటే మీరు పొరబడుతున్నట్టే! చర్మం, దాని పని తీరు వంటి అంశాలపై అవగాహనతో పాటు దానిని సంరక్షించుకోవటంలోని మెళకువలు తెలుసుకుంటే నిగనిగలాడే చర్మం ప్రతి ఒక్కరి సొంతం అవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు.

 మృతకణాల పొరలు : మన శరీరంలో అతి పెద్ద అవయవం ‘చర్మం'. లోపలి భాగాలను కప్పిఉంచటమే కాదు, ఒక కవచంలా మనల్ని అంటి పెట్టుకుని ఉంటుంది. పైకి కనిపించే చర్మం పూర్తిగా 25- 30 అతిసన్నటి పొరల మృతకణాలతో తయారై ఉంటుంది . ప్రతీ 28-30 రోజులకోసారి కొత్త కణాలను తయారుచేసుకుంటుంది మన శరీరం. వాతావరణ కాలుష్యం, దుమ్మ ధూలితో చర్మం మలినమైనప్పుడు మృతకణాలు పూర్తిగా తొలగించుకునే శక్తి చర్మానికి లేదు. ఈ పరిస్థితిలో మృతకణాలు గనక పేరుకుపోతే చర్మం గరుగ్గా మారుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే క్రమం తప్పకుండా సున్నిపిండి లాంటి పదార్థాలతో స్క్రబ్బింగ్ చేసుకొని మృతకణాలను తొలగించేందుకు మనవంతు సహాయం చేయాలి.

మెలనిన్ ‌: శరీర ఛాయను నిర్దేశించేది చర్మంలో ఉన్న మెలనిన్ శాతం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత నల్లగా ఉంటుంది శరీర ఛాయ. ఎండలో తిరిగినప్పుడు సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని కాపాడటం కోసం శరీరం మెలనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. అందుకే ఎండలో తిరిగినప్పుడు సన్‌టాన్ (చర్మం నల్లబడటం) అవుతుంది. అయితే మెలనిన్ ఎంత శక్తివంతమైనా సూర్యుడి ప్రతాపం నుంచి పూర్తిసంరక్షణ మాత్రం మనకందించలేదు. అందుకే ఎండలో తిరిగినప్పుడు తప్పనిసరిగా సన్‌టాన్ లోషన్‌ని వాడటం అలాగే సరైన దుస్తులతో సంరక్షించుకోవటం చేయాలి.

మృతకణాలు : చర్మం లోపలిపొర కింద ఉండే పొరని డెర్మిస్ అంటారు. ఇది మన చర్మానికి జీవాన్నిస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉండే నరాల చివర్లు, రక్తనాళాలు, నూనె, శ్వేత గ్రంధులు స్పర్శని కల్పించటంతోపాటు చర్మం ఊపిరి పీల్చుకోవటానికి సహాయపడతాయి. అయితే వీటితోపాటు కొలాజెన్, ఎలాస్టిన్, కెరటిన్ అనే అతి ముఖ్యమైనవి కూడా డెర్మిస్ పొరలో ఉంటాయి. పీచులాగా సాగే గుణం ఉన్న మాంసకృత్తులు ఇవి. మన శరీర పటుత్వం, ఆరోగ్యం, వంచ గలిగే శక్తిని ఎలాస్టిన్ నిర్దేశిస్తే, కొలాజన్ వృద్ధాప్యపు జాడలతో పోరాటం చేస్తుంది. కెరటిన్ శరీర దారుఢ్యాన్ని పెంచి హుషారుగా ఉంచుతుంది .

కొలాజెన్ : కొలాజెన్ మన చర్మాన్ని శరీరంతో పాటే పట్టివుంచేలా దోహదపడుతుంది. కెరటిన్‌ తో కలిసి ఇది మన శరీరానికి ఎంతోమేలు చేస్తుంది. శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకి కొలాజెన్ ప్రమేయం ఉంది. కనుక దీన్ని తయారు చేసుకోగలిగే శక్తి శరీరానికి ఉంటే అమృతం తాగిన దేవతల్లా నిత్యయవ్వనంతో ఉండిపోవచ్చు. వృద్ధాప్యపు ఛాయ కూడా దరిచేరకుండా చేస్తుంది. అయితే దురదృష్టవశాత్తు వయసు పైబడే కొద్దీ కొలాజెన్ తగ్గిపోవటం వలన చర్మం పలచగా తయారవ్వటమే కాదు పటుత్వం కోల్పోయి ముడతలు పడుతుంది. ఇలా జరగకుండా మనం తినే ఆహారం ద్వారా మన శరీరానికి అవసరమైనంత కొలాజెన్‌ను అందించవచ్చు. కొన్ని రకాల విటమిన్లు, యాంటిఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్...అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవటం ద్వారా దీన్ని సాధించవచ్చు.

కొన్ని ఆహారపదార్థాలు వయసు కనిపించనీయకుండా చర్మం మెరిసేలా చేస్తాయి. అవి  నిత్యయవ్వనంగా మార్చే కొలాజెన్ ఆహారాలు..


  • పాలకూర :
విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.


  • సబ్జా గింజలు :
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో సబ్జాగింజలు ముందుంటాయి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. రోజూ ఒక స్పూను సబ్జాగింజల్ని తింటే చర్మం యౌవనంగా ఉంటుంది.






  • టొమాటోలు :
ఇందులో లైకోపీన్‌ చర్మానికి మంచి మెరుపుని అందిస్తుంది. ఇందులో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు చాలా ఎక్కువ. కాలుష్యం నుంచి, హానికారక సూర్యకిరణాల నుంచి లైకోపీన్‌ కాపాడుతుంది.


  • బాదం :
చర్మ సౌందర్యానికి ఎంతో అవసరమయ్యే విటమిన్‌ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పలుకుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ నాలుగు బాదం పలుకుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన తింటే మంచిది.


  •  బ్లూ బెర్రీస్: 
ఇందులో ఉండే యాంటిఆక్సిడెంట్స్... కణాలు ఆక్సిజన్‌ను ఉపయోగించుకున్న తరవాత విసర్జించిన ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే హానిని రిపెయిర్ చేయటానికి ఉపయోగపడతాయి. ఇవి సమృద్దిగా ఉన్న ఆహారం తీసుకోవటం వల్ల కొలాజెన్ ఉతపత్తి పెంచవచ్చు. కిస్‌మిస్, టమాటా, వెల్లుల్లి, ద్రాక్షా, పప్పుదినుసులు, సోయా, గ్రీన్ టీ, పాలకూర...


  • సాల్మన్ ఫిష్:
  సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఈ ఒమేగా యాసిడ్స్ మన శరీరానికి ఎంతో ఉపయోగపడి, కొలాజెన్ ఉత్పత్తి పెరగటానికి తోడ్పడే వీటిని మన శరీరం తయారుచేసుకోలేదు. మనం తినే ఆహారం ద్వారానే వీటిని సమకూర్చాలి. చేపలు (ముఖ్యంగా సాల్మన్, ట్యునా వెరైటీ), జీడిపప్పు, బాదాం పప్పు. ఇది కొలాజెన్ ఉత్పత్తికి ఎంతో కీలకమైనది.


  • సోయా ప్రొడక్ట్స్: 
సోయా ప్రొడక్ట్ లో కూడా విటమిన్ సి తో పాటు జింక్ కూడా అధికంగా ఉంటుంది. సోయా మిక్క్ మొటిమలు, మచ్చలు పోగొట్టి, చర్మసమస్యలను దూరం చేస్తుంది. నిర్జీవమైన చర్మాన్ని తాజాగా చేసి ఫ్రెష్ గా మార్చుతుంది. కాబట్టి సేయాబేస్డ్ ప్రొడక్ట్ , సోయా పాలు తాగడం మంచిది.


  • క్యారెట్స్: 
క్యారెట్స్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటీ అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలు ఇవ్వటంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూర్చుతాయి. కాబట్టి మెరిసేటటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతి రోజూ క్యారెట్ తినడం కానీ, లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి.


  • కీర దోస:
  దోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కులో విటమిన్‌ 'కె' సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం దోస తొక్కులో వుంది. దోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు పోతాయి.


  •  అరటి: 
ముఖానికి రిఫ్రెషనస్ బనానా అరటిపండును చర్మ సంరక్షణ గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పవచ్చు. బనానా మాయిశ్చరైజర్ తో ముఖానికి రిఫ్రెషనస్ వస్తుంది.









  • ఆరెంజ్: 
వృద్ధాప్య ప్రక్రియలో ఆరెంజ్ ఆరెంజ్ లో సి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని బాగా ఉపయోగపడుతుంది. సి విటమిన్ చర్మానికి మంచి మెరుగును అందిస్తుంది. విటమిన్ ఇ, ఎ, సి . కొలాజెన్ ఉత్పత్తికి,మెయింటెన్ చేయటానికి సహాయపడే వీటిని తినే ఆహారం ద్వారా సులువుగా శరీరానికి అందించవచ్చు.


  •  బొప్పాయి: 
బొప్పాయి బొప్పాయిన మన పూర్వీకుల నుండి ఉపయోగిస్తున్నారు. పాపాయలో ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ మరియు ఎంజైములను ఫుష్కలంగా...










  •  ఆపిల్స్: 
యాపిల్ ను ఆహరంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఈ పాండులో లబించే పోtaశియం, ఫాస్ఫరస్ చాల మేలు చేస్తుంది.

  • వేరు శనగ :
వేరు శనగల్లో అధిక మోతాదులో ఉండే విటమిన్ ఇ, సిలీనియం, జింక్ శరీర సౌందర్యానికి కావలసిన హార్మోన్ ల ఉత్పత్తిలో సహకరిస్తాయి. రక్తప్రసరణ మెరుగుపరచి మంచి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి ఉపకరిస్తాయి.


  • బీట్ రూట్: 
రూట్ దుంపల్లో అధిక శాతంలో ఐరన్ మరియు విటమిన్స్ ఉండి, చర్మగ్రంధులను శుభ్రం చేయడానికి, రక్త ప్రసరణ జరగడానికి, ముఖంలో పింక్ గ్లో తేవడానికి సహాయపడుతాయి. కాబట్టి ప్రతి రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగాలి. అలాగే దీన్ని ఫేస్ ఫ్యాక్ గా కూడా వేసుకోవచ్చు. జింక్, సల్ఫర్ పళ్లు,కాయగూరల్లో లభ్యమయ్యే ఈ ఖనిజాలు కొలాజెన్ ఉత్పత్తిని పెంచి సంరక్షిస్తాయి.


  • కివి: 
కివి ఇది ఒక సిట్రస్ ఫ్రూట్. ఇందులో కూడా విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది సహజంగా చర్మ ఛాయను మార్చడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ కివి పండును తాజాగా తినవచ్చు. మరియు ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, ముఖంలో రంద్రాలు తొలగిపోయి, ముఖ్యం బ్యూటిఫుల్ గా కనబడుతుంది.


  • నీరు: 
వయస్సును తగ్గించడంలో ప్రతి రోజూ మనం తీసుకొనే డైయట్ లో నీరు కూడా ఒక భాగమే. నీరు ఇంటర్నల్ గాను, ఎక్సటర్నల్ గాను మంచి ప్రయోజనకారి. ప్రతి రోజూ ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానకి కావల్సిన తేమ అంది ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజు క నీసం 6-8 గ్లాసుల నీళ్లు తాగటం అన్నది స్వేదగ్రంథుల నుంచి విషపదార్థాలను బయటికి విసర్జించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Source: http://food-health-disease.blogspot.in/

రోగనిరోధకాలు గా ఆహారపదార్ధాలు

రీరంలో రోగ నిరోధక శక్తి ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. వానాకాలం వచ్చే వర్షాలు, కలుషిత నీటివల్ల తరచుగా జలుబు, జ్వరం, అలసట, ఎలర్జీల బారిన పడే అవకాశం ఉంది. వీటన్నింటి నుండి తప్పించు కోవాలంటే రోజూ తినే ఆహార పదార్థాల ద్వారానే రోగనిరోధక శక్తిని పెంచు కోవాలి.

సరైన ఆహాహాన్ని తీసుకుంటే ఈ సమస్యను తేలికగా అధిగమించ వచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్‌‌స, పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

విటమిన్లు:
విటమిన్‌ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమాట, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్‌ సి ఉంటుంది.

జింక్‌:
శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పున…ఃనిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాసం, పెరుగు, పాలు, బీన్‌‌స, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.

పెరుగు:
ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది.

కెరోటిన్‌‌‌:
ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి.

వెల్లుల్లి:
దీనిలో ఉండే మినరల్‌‌స బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.

ఐరన్‌: 
రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది.

పొటాషియం:
దీనిలో విటమిన్‌ సి, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. దీని వల్ల అధిక రక్తపోటుని తగ్గించి శక్తిని పెంచుతుంది.

పత్రం- పత్రాల ఔషధము

మాచీ పత్రం -నేత్రములకు మంచి ఔషధము.  ఆకుని తడిపి కళ్ళ మీద ఉంచుకోవాలి.  పసుపూ నూనెతో నూరి ఒంటికి రాసుకోవాలి.

నేలమునుగ ఆకులు - ఆకులను నూరి నీటితో సేవిస్తే దగ్గు తగ్గును.  శరీరమునకు దివ్యఔషధము.

మారేడు ఆకులు - మూల శంక నయమగును.  రోజూ  రెండు ఆకులని నమిలి రసాన్ని నిదానంగా మింగాలి.  కాయలోని గుజ్జుని ఎండబెట్టి పొడిచేసి మజ్జిగలో  వేసుకుని తాగాలి.

జంటగరిక ఆకు - మూత్ర సంబంధ వ్యాధులు  తొలుగును.  పచ్చడి చేసుకొని తినవలెను.

ఉమ్మెత్త ఆకు - మానసిక రోగాలు తొలగును.  ఆకుల రసాన్ని తీసి రోజూ తలమీద మర్దన చేయాలి.

రేగు ఆకు - శరీర సౌష్టవానికి శ్రేష్టం.  మితంగా తింటే మంచిది.

ఉత్తరేణి ఆకులు - దంతవ్యాధులు నయమగును.  ఈ కొమ్మ పుల్లతో పళ్ళు తోముకోవాలి.

తులసీ ఆకులు - దగ్గు, వాంతులు, సర్వ రోగనివారిణి.  రోజు ఐదు, ఆరు ఆకులను తింటే మంచిది.

మామిడి ఆకు - కాళ్ళ పగుళ్ళు, అతిసారం నయమగును.  మామిడి జిగురులో ఉప్పు కలిపి వేడి చేసి పగుళ్ళకు రాయాలి.

గన్నేరు ఆకు - జ్వరమును తగ్గించును[లోనికి తీసుకోరాదు]

అవిసె ఆకు - రక్త దోషాలు తొలగును.  ఆకు కూరగా వాడవచ్చు.

అర్జున పత్రం -మద్ది ఆకులు - వ్రణాలు తగ్గును.  వ్రణాలున్న భాగాల్లో ఆకులను నూరి రాసుకోవాలి.

దేవదారు ఆకులు - శ్వాశకోశ వ్యాధులు తగ్గును

మరువం ఆకులు - శరీర దుర్వాసన పోగొట్టును.  వేడినీటిలో వేసుకొని స్నానం చేయవలెను.

వావిలి ఆకు - ఒంటినొప్పులను తగ్గించును.  నీటిలో ఉడికించి స్నానం చేస్తె మంచిది.

గండకీ ఆకు - వాత రోగములు నయమగును

జమ్మి ఆకులు - కుష్ఠు వ్యాధులు తొలగును.  ఆకుల పసరును ఆయా శరీర భాగాలలో రాసుకోవాలి.

జాజి ఆకులు - నోటి దుర్వాసన పోగొట్టును.  ఆకులను వెన్నతో కలిపి నూరి పళ్ళు తోముకోవాలి.

​రావి ఆకులు - శ్వాసకోశ వ్యాధులు తగ్గును.  పొడి చేసి తేనెతో సేవిస్తే మంచిది. ​

దానిమ్మ ఆకు - అజీర్తి, ఉబ్బసం తగ్గును.  పొడిచేసి కషాయంగా తాగవచ్చు. ​

జిల్లేడు ఆకులు - వర్చస్సు పెంచును.

source: http://food-health-disease.blogspot.in/

చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించేవి

ఆపిల్ పండు: 


రక్తంలోని కొలెస్ట్రాల్ నిల్వల్ని తగ్గించడంలో ఆపిల్ పండు ఉపయోగపడుతుంది. లివర్ తయారు చేసే చెడ్డ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది.  ఈ పండులో మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వులను జీర్ణం చేస్తుంది.

బీన్స్ :

బీన్స్ లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్ లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయి.

బెర్రీస్:


  •  








బ్లాక్ బెర్రీ లోని విటమిన్స్ గుండెకు, ప్రసరణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయి. దీనిలోని కరిగే పీచు పెక్టిన్ కొలెస్ట్రాల్ ను శరీరం నుంచి బయటికి పంపుతుంది. Bad
వంకాయ: అనేక రకాల విటమిన్లు, మినరల్స్ కలిగిన వంగ అనేక ఫైటో న్యూట్రియంట్లు కలిగి ఉంటుంది. ఆక్సీకరణ ప్రక్రియలో తోడ్పడతాయి.

ద్రాక్ష:


ఆంతో సైనిన్స్, టానిన్స్ వంటివి కొలెస్ట్రాల్ నిల్వల్ని బాగా తగ్గిస్తాయి. ద్రాక్ష లోని పొటాషియం, శరీరంలోని విష పదార్థాలను నిర్విర్యం చేస్తుంది. మధుమేహగ్రస్తులకు  ద్రాక్ష నిషిద్ధం.

జామపండు:


  •  
తాజా జమపండ్లు శరీరానికేంతో మేలు చేస్తాయి. జమలోని విటమిన్ సి  భాస్వరం, నికోటిన్ ఆమ్లం, కరిగేపీచు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను పటిష్ట పరిచి, కొలెస్ట్రాల్ తగ్గించి, గుండెను సంరక్షిస్తాయి.

పుట్టగొడుగులు: కొలెస్ట్రాల్ నిల్వలు తగ్గించంలో మాష్ రూమ్స్ లోని విటమిన్స్ బి, సి కాల్షియం, మినరల్స్ బాగా ఉపయోగాపడతాయి.

గింజలు(nuts):


 

బాదం పప్పు తినడం వల్ల చెడ్డ కొలెస్ట్రల్ ను తగ్గిస్తుంది. దీనిలోని ఒలియిక్ ఆమ్లం, గుండెను వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. జీడిపప్పులోని మోనో అన్  సచురేటేడ్ కొవ్వును తగ్గించి గుండెను

పదిలంగా ఉంచుతాయి. వాల్ నట్స్ లోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు చెడ్డ కొలెస్ట్రాల్ ను గణనీయంగా తగ్గిస్తాయి.

వెళ్ళుల్లి : 

  •  

రక్తపోటును, ఎక్కువగా వున్న చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

సోయా: 

  •  


ఎనిమిది రకాల ఆవశ్యక మూలకాలు గల ఒకే ఒక శాకాహార మాంసకృత్తులు సోయాలో వున్నాయి. సోయా మాంసకృత్తులు రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రక్తం నుండీ కొలెస్ట్రాలును విసర్జించే లివర్ శక్తిని పెంచుతుంది. సోయా చిక్కుల్లలో విటమిన్ b3, b6, E , ఉన్నాయి.

ఓట్ మీల్ (oatmeal) 


  •   -

దీనిలోని బీటా గ్లూకస్ అనే ప్రత్యేక కరిగే పీచుపదార్థం  స్పంజివలె పనిచేసి కొలెస్ట్రాల్ ను గ్రహిస్తుంది.

సబ్జా గింజలుల:



దీని పొట్టు పెగులలోనికి కొలెస్ట్రాల్ ప్రవేశించనీయదు. చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించే అత్యంత శక్తి వంతమైన పదార్థంగా ప్రసిద్దికెక్కింది.

పొట్టు తీయని గింజలు :




గోధుమ, మొక్కజోన్న  ఓటు ధ్యాన్యం, బార్లీ వీటిలోని 3 పొరలను కలిపి ఏక మొత్తంగా తింటే కొలెస్ట్రాల్ పరిమాణం రక్తపోటు, రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది.

పిల్లలలో గోళ్ళు కొరికే అలవాటును నియంత్రించడమెలా?

ఇది పిల్లలలో అత్యంత సర్వసాధారణముగా కనిపించే గుణము . పిల్లలు ఈ విధమౌగా గోళ్ళు ఎందుకు కొరుతారనడానికి అనేక కారణాలు ఉంటాయి.

    ఒత్తిడి నుండి ఉపసమనము కోసము కావచ్చు
    అలవాటు గానో కావచ్చు ,
    ఎవరినైఅనా అనుకరిస్తూనో చేయవచ్చు ,
    ఖాళీ గా  ఏమీ తోచకుండా ఉన్నప్పుడు ఈ పని చేయనూ వచ్చు.

చిన్నతములోనే అలవాటు తొలిదశలోనే అడ్డుకోకపోతే ఎదుగుతున్నా ఆ అలవాటు మానరు . పిల్లలిలా గోళ్ళు కొరకడానికి గల కారణాన్ని తెలుసుకోవాలి . ఒత్తిడి లేదా యాంగ్జైటీ ఉండి ఉంటే అదెందువల్లనో గుర్తించాలి.  పరీక్షల భయము , స్నేహితుల ఒత్తిడి , కుటుంబసబ్యులలో లేదా స్కూల్లో తోటి పిల్లలతో తగాదాలు వంటివి కారనమైతే ... ఆ దిశగా పిల్లల యాంగ్జైటీని తగ్గించే ప్రయత్నాలు చెయ్యాలి.  ఓ అలవాటుగా చేస్తుంటే ఇదెంతటి దురలవాటో , దీనివల్ల ఎటువంటి అనారోగ్యాలు వస్తాయో, పిల్లల పట్ల  ఎదుటివారి అభిప్రాయము ఏవిధముగా ప్రభావితము అవుతుందో వారికి వివరించాలి .బలవంతము గానో , పనిష్మెంట్ల భయం తోనో కాక అవగాహనతో మానిపించే దిశగా ప్రయత్నించాలి. పనిష్మిమెంట్లు ఇవ్వడము వల్ల పిల్లలు గోళ్లు కొరకడాన్ని మానకపోగా ఇంకా ఎక్కువ చేస్తుంటారు. అలాగే వేళ్ళకు చేదు రాయడము వంటివి చేయకూడదు ఇతరత్రా పనులలో వారిని ఎంగేజ్ చెయ్యడము వల్ల వారికి గోళ్ళు కొరుక్కోవాలన్న తలంపు రాదు . 

పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు -- క్లుప్తముగా వాటి వివరాలు

Agajaatha - అగజాత : పార్వతీ దేవికి “శక్తి, అంబిక, అగజాత, దుర్వ, దేవి, దాక్షాయణి, భువనేశ్వరి, భవాని, భార్గవి, సతి, గిరికన్య, గిరిజ, గౌరి, కాత్యాయని, కాళి, మేనక, మాత …అని అనేక పేర్లు ఉన్నాయి. 

AghuDu - అఘుడు : రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.

అగస్త్య మహర్షి,Agastya Muni : అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. ఈయన బ్రహ్మదేవుని మానస పుత్రుడు .అగస్త్య మహర్షి కాశీలో వుండేవాడు, దక్షిణాపథానికి ఎందుకొచ్చాడు? అంటే, పూర్వం మహానుభావులు ఏమి చేసినా ప్రజా శ్రేయస్సుకోసమే చేసేవారు.  అలాగే అగస్త్యుడుకూడా ప్రజల శ్రేయస్సు కోసమై కాశీలో సదాశివుని సన్నిధి విడిచి దక్షిణాపధానికి వచ్చాడు.భార్య పేరు లోపాముద్ర .

Agni - అగ్ని: వేదములలో పేర్కొన్న ఓక దేవతా మూర్తి . అతని భార్య స్వాహాదేవి.

Anasuya : అనసూయ - అసూయ లేనిది. అనసూయ అత్రి మహర్షి భార్య మరియు మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.

Anjana - అంజన: కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది.

Atri : అత్రి - బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు . సప్తర్షులలో ప్రథముడు. ఆయన భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు.

Arjunudu : అర్జునుడు - స్వచ్చమైన చాయ కలవాడు. పాండవులలో మద్యముడు . కుంతి కి మంత్రశక్తివలన ఇంద్రునిచే జన్మించినవాడు . . పాండురాజు తనయుడు .ఇతనికి అనేక పేర్లు  ముఖ్యము గా 10 పేర్లు :
అర్జునుడు , 
పార్దు , 
కిరీటి , 
పాల్గుణ, 
శ్వేతవాహనుడు , 
భీభత్సుడు , 
ధనంజయుడు , 
విజయుడు , 
నవ్య్ సాచి , 
జిష్ణుడు .

AbhimanyuDu : అభిమన్యుడు -- అర్జునుడు - సుభద్రల కుమారుడు . కురుక్షేత్ర సంగ్రామములో పద్మవ్యూహం లోపలకు వెళ్ళి బయటకు రావడం తెలియక మరణించాడు . అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను కలుసుకొని పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు..... యధిష్టురుని తరువాత హస్తినాపురానికి (పరీక్షిత్తు) రాజు అయ్యాడు. పరీక్షిత్తు వలననే పాండవ వంశము వృద్ధి చెందినది.

AnaadrushyuDu : అనాదృష్యుడు -- గాంధారీ , ధృతరాష్ట్రుల కుమారుడు . నూరుగురు కౌరవులలో ఒకడు .

Aswaddhaama :అశ్వత్థామ - గుర్రము వలె సామర్ధ్యము/బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు. ఇతడు చిరంజీవి . ద్రోణుని కుమారుడు . పాండవ ద్వేషి .

AnjanEyuDu : ఆంజనేయుడు - 'అంజన'కు పుట్టినవాడు అని అర్ధము . హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి,మారుతి , వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.

Ambika : అంబిక-- 1. హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Ambika : అంబిక--2. మహాభారతము లో సత్యవతి - శంతన మహారారు కుమారుడైన చిత్రాంగుని భార్య పేరు అంబిక . భర్త చనిపోయిన తరువాత ఈమె కు వ్యాసుని వలన గుడ్డివాడైన ధృతరాస్ట్రుడు జన్మిస్తాడు .

Ambaalika : అంబాలిక -- విచిత్రవీర్యుని ఇద్దరి భార్యలలో రెండెవది . విచిత్ర వీర్యుడు 8 సమ్వత్సరాలు కాపురము చేసి క్షయ (టి.బి.) వ్యాధి లో చనిపోయిన తరువాత అత్తగారైన సత్యవతి ప్రోద్బలముతో వ్యాసుని వలన పాండురాజును కన్నది .

Amma : అమ్మ--హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

AnirudduDu : అనిరుద్దుడు -- శ్రీకృష్ణుని మనుమడు . ప్రద్యుమ్నుని కుమారుడు . బాణాసురుడి కుమార్తె ' ఉష ' కు భర్త .

AkrUruDu - అక్రూరుడు : శ్రీకౄష్ణుని మేనమామ. అక్రూరుడు తండ్రి శ్వఫల్కుడు , కాశీరాజు కుమార్తెకు, శ్వఫల్కుడికి జన్మించిన వాడే అక్రూరుడు, సత్ప్రవర్తన, బ్రహ్మచర్య దీక్ష కలిగిన అక్రూరుడే శమంతక మణిని గ్రహించటానికి అర్హుడని కృష్ణుడు ఆమణిని అక్రూరుడికి ఇచ్చాడు. అలా ఆనాటినుండి అక్రూరుడు మనస్సులో ఎలాంటి భయాలు లేకుండా యజ్ఞాలను, శమంతక మణి ఇచ్చే బంగారం సహాయంతో చేస్తూ లోకకళ్యాణానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.

Akarkaarudu - అకర్కారుడు : కద్రువ కొడుకు. ఒక సర్పం.


Aparna : అపర్ణ --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Ayati : అయతి -- మేరువు కుమార్తె , ధాత భార్య . ఈమె కుమారుడు .. ప్రాణుడు .

AkshayapAtra : అక్షయపాత్ర -- అరణ్యవాసము చేస్తున్న ధర్మరాజు తనవెంట బ్రాహ్మణ భోజనార్ధం సూర్యుడుని ప్రార్ధించి ఒక పాత్ర సంపాదించారు . దానిలో కొద్దిగా వండినా అక్షయమవుతుంది (సరిపోయినంత) , దానితో ధర్మరాజు నిరంతరము అన్నదానాలు చేస్తుంటాడు .

Agnishauchamu , అగ్ని శౌచము : కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము .

Alakananda : అలకనంద -- దేవలోకం లోని గంగానది . పితృలోకాలో పయనించేటప్పుడు దీనిని ' వైతరణి ' అంటారు . మూడు లోకాల్లో పారే నది కాబట్టి గంగానదిని త్రిపథగ అంటారు.

స్వర్గలోకం, భూలోకం, పాతాళలోకం అనేవి ఆ మూడు లోకాలు.

* స్వర్గలోకంలో మందాకిని,

* భూలోకంలో గంగ మరియు అలకనంద

* పాతాళలోకంలో భోగవతి

అని గంగానదికి పేర్లు.

AtikaayuDu : అతికాయుడు - రావణుని కుమారుడు . పినతండ్రులు, సోదరుల మరణం చూసి మహా తేశ్శాలి అయిన అతికాయుడు మరొక కుంభకర్ణుడిలా యుద్ధంలోకి దూకాడు. వానర నాయకులు విసిరిన చెట్లు, పర్వతాలు, బండరాళ్ళూ పిండి చేసేశాడు. లక్ష్మణుడు, అతికాయుడు ఒకరికి తీసిపోకుండా ఒకరు మెరుపులలాంటి శస్త్రాస్త్రాలతో యుద్ధం చేశారు. చివరకు వాయుదేవుని సలహాపై సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుని తల తెగనరికాడు. భయభ్రాంతులై రాక్షస సేన అంతా లంకలోకి పరుగులు తీశారు.

Aanantha vijayam , అనంత విజయం : ధర్మరాజు శంఖము

Achala,అచల: కుమారస్వామి మాతౄగణములోని ఓక స్త్రీమూర్తి.

Ahalya ,అహల్య : అహల్య  గౌతమ మహర్షి భార్య.ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడినది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడినది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి.
పుట్టుక-- బ్రహ్మ అహల్యను అత్యంత సౌందర్యవతిగా సృష్టించాడు. దేవతలందరూ ఆమెను పరిణయమాడాలనుకున్న వారే. అప్పుడు బ్రహ్మ త్రిలోకాలను ఎవరైతే ముందుగా చుట్టి వస్తారో ఆమెను వివాహమాడడానికి అర్హులని ప్రకటిస్తాడు. ఇంద్రుడు తన శక్తులన్నింటినీ ఉపయోగించి ముల్లోకాలను తిరిగి వచ్చి అహల్యను ఇచ్చి వివాహం జరిపించమని బ్రహ్మను కోరుతాడు. అప్పుడు నారదుడు వచ్చి గౌతముడు ఇంద్రుడికంటే ముందుగా ముల్లోకాలను చుట్టి వచ్చాడని చెపుతాడు. గౌతముడు తన దైనందిన పూజలో భాగంగా గోవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడని. ఒకరోజు అలా ప్రదక్షిణ చేస్తుండా ఆవు లేగ దూడకు జన్మనిచ్చిందనీ, శాస్త్రాల ప్రకారం శిశువును ప్రసవిస్తున్న ఆవు ముల్లోకాలతో సమానమనీ అందుకే అతనికి ఆ ఫలితం దక్కిందనీ తెలియజేస్తాడు. కాబట్టి అహల్యను గౌతముడికే ఇచ్చి పెళ్ళి చేయమని చెపుతాడు.


BabruvAhanuDu-బభృవాహనుడు : బభృవాహనుడు అర్జునుడు మరియు మణిపురపు రాకుమారి చిత్రాంగదలకు కలిగిన కుమారుడు. అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున మణిపురపు రాకుమారి చిత్రాంగదను చూచి వలచాడు. చిత్రాంగద తండ్రి అయిన చిత్రవాహనునికి ఆమె ఒక్కతే సంతానం. చిత్రవాహనుడు చిత్రాంగదకు కలిగే సంతానము మణిపురములోనే ఉండి రాజ్యమును పరిపాలించవలెను అని పెట్టిన షరతుకు అంగీకరించి అర్జునుడు చిత్రాంగదను వివాహము చేసికొన్నాడు. బభృవాహనుడు తన తాత తదనంతరం మణిపురమును పాలించాడు.


 Bali chakravarti:బలిచక్రవర్తి -- బలి చక్రవర్తి దానాలలో శిబి చక్రవర్తి అంతటి వాడు. దశావతారాలలో శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుడు  మూడు అడుగుల స్థలం అడుగగా బలి దానమివ్వగా, వామనుడు(హరి) తివిక్రమ రూపాన్ని ఎత్తి రెండు పాదాలతో ఆకాశం, భూగోళం నింపగా, మూడో అడుగు ఎక్కడ అని ప్రశ్నించగా బలి తన శిరస్సు చూపుతాడు.

BarbareekuDu -బర్బరీకుడు :  బర్బరీకుడు మహాభారతంలో ఘటోత్కచుని కుమారుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతడు శ్రీకృష్ణుని చేత వధించబడ్డాడు.


Bhavani : భవాని --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Bharavi : భైరవి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Balaramudu : బలరాముడు -- బలముచే జనులను రమింపచేయువాడు., వీరు స్వయం భగవానుడు అయిన శ్రీకృష్ణుల వారికి సోదరులగా జన్మించిన అంశావతారము. వీరి ఆయుధము హలము , నాగలి. వీరు గొప్ప వీరులు, దయామయులు, కృష్ణుని అన్ని వేళలా తోడు గా ఉన్నవారు. వీరి భార్య రేణుక .

Badrakaali : బద్రకాళి -- పార్వతి ( Parvati) మరో పేరు . హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, బద్రకాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Bruhaspati : బృహస్పతి - బృహత్తులకు (వేదమంత్రాలకు) ప్రభువు (బృహస్‌పతి).బృహస్పతి కి ఇంకో పేరు గురుడు. బృహస్పతి దేవతలకు గురువు. బృహస్పతి భార్య తార చంద్రుని అందానికి మోహించి పతిలేని సమయంలో చంద్రుని తో రతి సరసాలు జరిపెను . అందువలన గర్భవతి అయ్యెను. ఈమెను చంద్రుడు తీసుకొనిపోగా, బృహస్పతితో యుద్ధం జరిగెను. ఇంతలో తారకు బుధుడు జన్మించెను. తగవు తీర్చడానికి వచ్చిన బ్రహ్మ తారను అడిగి నిజం తెలుసుకొని బుధుని చంద్రునకు, తారను బృహస్పతికి ఇప్పించెను.

Bharatudu : భరతుడు - అశేషమైన భూమిని భరించిన (పోషించిన) వాడు.
1.భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు. సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదులకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు.
2. భరతుడు మహాభారతములో శకుంతల-దుష్యంతుల కుమారుడు . భరతుడు పరిపాలించిన దేశము గనుక భారతదేశము అని పేరు వచ్చినది .

Bhimudu : భీముడు - భయమును కలిగించువాడు . భీముడు పాండవ ద్వితీయుడు. మహాభారత ఇతిహాసములో వాయుదేవుడి అంశ. పాండురాజు సంతానం. కుంతికి వాయుదేవునికి కలిగిన సంతానం. ద్రౌపతి , హిడింబి ఇతని భార్యలు . హిడింబాసురుణ్ణి వధించి తనని వరించిన ఆతని సోదరి హిడింబి అను రాక్షస వనితను కుంతీ ధర్మరాజాదుల అనుమతితో వివాహమాడినాడు. వారిరువురికీ కలిగిన సంతానమే మహాభారత యుద్దమందు తన మాయాజాలముతో వీరంగము చేసి ప్రసిద్దుడైన ఘటోత్కచుడు. కురుక్షేత్ర సంగ్రామంలో ఆరు అక్షౌహిణుల మేర శత్రుసైన్యాన్ని నిర్జించినాడు. ధుర్యోధన దుశ్శాసనాది కౌరవులు నూర్గురినీ భీమసేనుడే వధించినాడు.

Bhishmudu : భీష్ముడు - తండ్రి సుఖము కొరకై తను రాజ్య సుఖములను వదులుకోవడమే కాక వివాహం చేసుకోను అని భీష్మమైన (భయంకరమైన) ప్రతిజ్ఞ చేసినవాడు. ఆ జన్మ భ్రహ్మచారి . మహాభారతంలో గంగాదేవీ శంతనమహారాజుకి జన్మించినాడు , భీష్ముడు పూర్వ నామం "దేవవ్రతుడు". భారతంలో ఒక ప్రధానమైన, శక్తివంతమైన పాత్ర భీష్ముడిది. సత్యవర్తనుడిగా, పరాక్రముడిగా భీష్ముని పాత్ర అనిర్వచనీయమైనది.

BaaNaasuruDu : బాణాసురుడు -- వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని వంశపరంపర-> * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.
వీడు అకుంఠిత దీక్షతో పరమ శివుని ధ్యానించి అయన్ని మెప్పించి తనకు రక్షణ గా శోణపురానికి తెచ్చుకొన్నాడు. ఈ అసురుని చూస్తే సమస్త భూలోకం, స్వర్గలోకం కూడా గజగజ వణికి పోతూ ఊండేది. ఒకసారి వీడికి రణకండుతి చాలా ఎక్కువై శివునితో మహాదేవా నువ్వుతప్ప నాతో యుద్ధం చేసేవారేలేరా అని అనగా శివుడు వీని రణకండూతికి , మూర్ఖత్వానికి చింతించి నీ రధం మీద ఉన్న జండా క్రిందకు పడినప్పుడు నిన్ను జయించేవాడు వస్తాడు అని చెప్తాడు.

Daakini : డాకిని -- మంత్రాలను వల్లించడం ద్వారా అద్భుతాలు చేసే స్త్రీ . హిందూ పురాణాలలో చెప్పబడిన స్త్రీ .

Damayanthi : దమయంతి - 'దమనుడు' అను ముని వరము వలన జన్మించినది. 2. తన అందముచే ఇతరులను దమించునది.(అణచునది).భీమమహారాజు కుమార్తె ,నిషధ రాజా నలునితో వైభవోపేతంగా వివాహం జరిగింది. కుమార్తె ఇంద్రసేన, కుమారుడు ఇంద్రసేనుడు .

Damodarudu : దామోదరుడు -- క్రిష్ణుడు చిన్నతనం లో తల్లి యశోద అతని నడుముకు పొట్టకు కట్టువేసి బండరాయికి కట్టివేసినది . బంధితమైన పొట్టగల వాడు కనుకనే ఆ నాటి నుంచి ఆయనకు దామోదరుడు అనే పేరొచ్చింది.

Dasarathudu : దశరధుడు - దశ (పది) దిశలలో రధ గమనము కలవాడు. అయోధ్య రాజ్యానికి రఘు వంశపు రాజు . ముగ్గురు -(కౌషల్య , సుమిత్ర , కైకేయి ) భార్యలకు ... రాముడు , లక్ష్మణుడు , భరత ,శత్రుఘ్నులు (నలుగురు) కుమారులు .

Dattatreyudu : దత్తాత్రేయుడు -- శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు మూర్తి, మహేశ్వరుడు) స్వరూపం. గురుతత్వానికి మొదటివాడు అవడంవల్ల ఈయనకు ఆదిగురువనే పేరు ఉన్నది. సప్తర్షులలో ఒకడైన అత్రి మహర్షి, అనసూయల కొడుకే దత్తుడు. ఆయన ఎందరో మహా పురాణపురుషులకు, దేవతలకు జ్ఞానబోధ, సహాయము చేసిన ఉదాహరణలు వివిధ పురాణాలలో ప్రస్తావించబడ్డాయి.

Draupadi : ద్రౌపది -- పాంచాల రాజైన ద్రుపద మహారాజు కుమార్తె . మహాభారరము లో ప్రముఖ పాత్ర . అర్జునుడు మత్స్యయంత్రము కొట్టగా ఆమె పాండవులకు భార్య అయినది .

DrupaduDu : దృపదుడు -- పాంచాల రాజు . ద్రౌపది తండ్రి . ఈయన కుమారులు ... ద్రుష్టద్యుమ్నుడు , శిఖండి .

Dhanvantari : ధర్వంతరి -- క్షీరసాగర మధన సమయము లో జర్మించినది . ఆయుర్వేదానికి అధిష్టాన దేవత .

DharmarAju : ధర్మరాజు -- మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . యుధిష్టిరుడని మరొక పేరు . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి. జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు .

DharmavyAdhudu : ధర్మవ్యాధుడు --మిధిలా నగరము లో ఉండేవాడు . సమస్త ధర్మాలూ చక్కగా తెలిసినవాడు .

Dhrutaraastrudu :ధృతరాష్ట్రుడు -- కురువంశరాజు అయిన విచిత్రవీర్యుని కుమారుడు . అంధుడు . గాంధారి ఈయం భార్య . దుర్యోధనుడు .. .తదితర నూరు మంది కుమారులు , వీరినే కౌరవులు అంటారు .

Duryodhanudu : దుర్యోధనుడు - (దుర్+యోధుడు) ఇతరులు సుఖముగా యుద్ధము చేయుటకు వీలుపడనివాడు. మహాభారతంలో ధృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో ధుర్యోధనుడు ప్రధముడు, కౌరవాగ్రజుడు. గాంధారీ దృతరాష్ట్రుల పుత్రుడు. గాంధారీ గర్భవతిగా ఉన్న సమయంలో కుంతీదేవి ధర్మరాజుని ప్రసవించిన విషయం వినిన తరవాత 12 మాసముల తన గర్భాన్ని ఆతురతవలన తన చేతులతో గుద్దుకొని బలవంతంగా మృత శిశువుని ప్రసవించినది. ఈ విషయంవిన్న వ్యాసుడు హస్తినకు వచ్చి కోడలిని మందలించి ఆ పిండం వృధా కాకుండా నూటొక్క ముక్కలుగాచేసి నేతి కుండలలో భద్రపరచాడు. వ్యాసుడు వాటిని చల్లని నీటితో తడుపుతూ ఉండమని వాటిలో పిండము వృద్ధిచెందిన తరవాతనూరుగురు పుత్రులు ఒక పుత్రిక జన్మిస్తారని చెప్పి వెళ్ళాడు. గాంధారి వ్యాసుని ఆదేశానుసారం చేయగా ముందుగా వాటిలో పెద్ద పిండం పరిపక్వమై అందునుండి దుర్యోధనడు జన్మించాడు. తరవాత క్రమంగా తొంభై తొమ్మిదిమంది పుత్రులు ఒక పుత్రిక పేరు దుస్సల జన్మించారు. ఈ విధంగా గాంధారీ దృతరాష్ట్రులు దుర్యోధనాదులను సంతానంగా పొందారు.

Dussala : దుస్సల --ధృతరాష్ట్రుడు , గాంధారి ల ఏకైక కుమార్తె . ధుర్యోధనాదుల సోదరి . ఈమె సింధు దేశ రాజు జయద్రదుని వివాహము చేసుకొన్నది. కురుక్షేత్ర సంగ్రామంలో జయద్రదుని అర్జునుడు సంహరించాడు. ఈమెకు సురధుడు అను కుమారుడు ఉన్నాడు

Dusshaasanudu : దుశ్శాసనుడు - సుఖముగా శాసింప (అదుపు చేయ) సాధ్యము కానివాడు. దుశ్శాసనుడు గాంధారీ ధృతరాష్ట్రుల పుత్రుడు. దుర్యోధనుని నూరుగురు కౌరవ సోదరులలో ఒకరు. దుశ్శాసనుడు ద్రౌపతిని సభలోనికి జుట్టు పట్టుకొని లాగుకొని వచ్చి, నిండు సభ లో ద్రౌపతి వస్త్రాపహరణం నకు పూనుకున్నాడు. కానీ శ్రీ క్రిష్ణుడి అభయ హస్తం తో ద్రౌపతి గౌరవం కాపాడబడింది.

Dushyanthudu : దుష్యంతుడు-- హస్తినాపురానికి రాజైన దుష్యంతుడు మహారాజు . శకుంతల భర్త . భరతుని తండ్రి .


Daaxaayani : దాక్షాయణి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, బద్రకాళి , శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.



Durvaasudu : దుర్వాసుడు - దుష్టమైన వస్త్రము కలవాడు. (వాసమనగా వస్త్రము), దుర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి , అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. ఇలా శపించడం వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

Dronudu : ద్రోణుడు - ద్రోణము(కుండ)నుండి పుట్టినవాడు. భరద్వాజ మహాముని పుత్రుడు ద్రోణుడు. వేదవేదాంగాలన్నీ అభ్యసించాడు. ద్రోణుడితో పాంచాల దేశపు రాజకుమారుడు ద్రుపదుడు అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుడి చెల్లెలు కృపిని వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుని పేరు అశ్వత్థామ. పరశురాముడు వద్ద అస్త్రవిద్య నేర్చుకున్నాడు. అది తరవాతి కాలంలో హస్థినాపురంలో కౌరవులకు పాండవులకు అస్త్రవిద్య నేర్పటానికి దారితీసింది. . అర్జునుడు అతనికి ప్రియ విద్యార్థి.

DakshinAyanamu : దక్షినాయనము : సూర్య్భగవానుడు కర్కాటక రాశిలో ప్రవేశించిన సమయం నుండి మకరరాశిని చేరే వరకు మధ్యనున్న సమయమే దక్షిణాయనము . ఆ సమ్యములో సూర్యుడు భూమధ్యరే్ఖకు దక్షిణము గా సంచరిస్తాడు .

Dhvajastambham : ధ్వజస్తంభము -- సూర్యుని కాంతి కిరణములు నలభై ఐదు డిగ్రీల కోణము లో పరవర్తనము చెందుతాయి . ఆ దిశగా ధ్వజస్తంభాన్ని ప్రతిస్ఠారు . దక్షిణ వైపు నుంచి వచ్చే కుజగ్రహ కిరణాలు గోపుర కలశము మీదుగా ధ్వజస్తంభము పైనుంచి స్వామి భూమధ్యకి చేరుతాయి అందుకే ధ్వజస్తంభమునకు , స్వామికి మధ్యన నిల్చుని నమస్కరించాలి . అప్పుడే గ్రహశక్తితో పాటు స్వామి శక్తీ మనల్ని చేరుతుంది .

EkalavyuDu : ఏకలవ్యుడు -- మహాభారతంలో గురుభక్తిని చాటే ఒక గొప్ప ఔన్నత్యం ఉన్న పాత్ర. నిషాధ తెగకు చెందినవాడు. తక్కువ కులానికి చెందిన వాడైనా ద్రోణాచార్యుని గురుకులంలో విలువిద్యను అభ్యసించాలని కోరికను కలిగి ఉండేవాడు. ద్రోణుడు తిరస్కరించడంతో బంకమట్టితో అతని విగ్రహాన్ని ప్రతిష్టించుకుని స్వాధ్యయనం ప్రారంభించాడు. ఎంతో దీక్షతో విలువిద్యను అభ్యసించిన ఏకలవ్యుడు ద్రోణుడి ప్రియశిష్యుడు మరియు మేటి విలుకాడైన అర్జునునితో సమానంగా నైపుణ్యాన్ని సాధించగలిగాడు. ఏకలవ్యుడు ఎక్కడ తనను మించిపోతాడనే భయంతో అర్జునుడు తన గురువైన ద్రోణాచార్యుని ఆశ్రయించి ఏదైనా చర్య తీసుకోమని కోరాడు. అప్పుడు ద్రోణుడు ఏకలవ్యుని వద్దకు వెళ్ళి అతని కుడి చేతి బొటనవేలును గురుదక్షిణ గా ఇమ్మని అడుగుతాడు. గురువు పట్ల ఎనలేని భక్తి ప్రపత్తులు గల ఏకలవ్యుడు తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించక, తన కుడి చేతి బొటన వేలుని కోసి గురు దక్షిణగా సమర్పించాడు. చరిత్రలో నిలిచిపోయాడు.


Ethasham : ఏతశం --సూర్యుని రధం గుర్రాలలో ఒకటి 

Gouri : గౌరి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Gyaanaprasunaamba : జ్ఞానప్రసూనాంబ - పరాశక్తి అవతారము . శ్రీకాళహస్తీశ్వరుని భార్య .

Ganga : గంగ - గమన శీలము కలది .భగీరధునకు పుత్రికగా ప్రసిద్ధినొందినది కనుక భాగీరధి అని, జహ్నుమునికి పుత్రికగా ప్రసిద్ధి నొందినది కనుక జాహ్నవి అని గంగకు పేర్లు కలవు . గంగ అనగా తెలుగు భాషలో నీరు అని కూడా అర్ధం. పరమేశ్వరుని భార్యలలో ఒకరు .

Garutmanthudu : గరుత్మంతుడు - విశిష్టమైన రెక్కలు కలవాడు . గరుత్మంతుడు హిందూ పురాణాలలో ఒక గరుడ పక్షి (గ్రద్ద). శ్రీమహావిష్ణువు వాహనంగా గరుత్మంతుడు ప్రసిద్ధి. ఇతడు మహాబలశాలి. కాని వినయశీలి. ఆర్త్రత్రాణపరాయణుడైన శ్రీమహావిష్ణువు ఎక్కడికి వెళ్లాలనుకున్నా గరుత్మంతుదు సిద్ధంగాఉంటాడు. వెంటనే విష్ణువు గరుడారూఢుడై వెళ్లి ఆపన్నులను రక్షిస్తూ ఉంటాడు

GaanDivam , గాంఢీవం : అర్జునుడి ధనుస్సు . దీనిని అగ్నిదేవుడు ఖాండవ వనం దహనమప్పుడు అర్జునుడికి ఇస్తాడు .

హరిశ్చంద్రుడు(Harischandrudu): హరిశ్చంద్రుడు ఇక్ష్వాకు వంశములోని ప్రముఖ చక్రవర్తి. సత్యాన్ని జీవిత సంకల్పంగా భావించిన వ్యక్తి, విశ్వామిత్రుని వద్ద జరిగిన వాదనతో అతనికి ఇవ్వవలసిన సొమ్ముకొరకు భార్యను అమ్మి, కాటికపరిగా పనిచేసి తన సత్య సంధతను నిరూపించి చిరకాల కీర్తికిరీటాన్ని సంపాదించాడు.
తండ్రిపేరు =సత్యవ్రతుడు , ఈ సత్యవ్రతునికే ' త్రిశంకుడనే ప్రసిద్ధ నామము ఉంది. 
తల్లిపేరు --సత్యరధ , 
భార్య పేరు -- చంద్రమతి , 
కొడుకు పేరు -- లోహితాస్యుడు .

Indrajittu : ఇంద్రజిత్తు - ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము). ఇంద్రజిత్తు -- రావణాసురిడికి మండోదరి కి జన్మించిన పెద్ద కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్ధం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాధుడు అని నామకరణం చేశారు. స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా పరమేష్ఠి(బ్రహ్మ) అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన లక్ష్మణుడు యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు. ఆదిశేషుని కుమార్తె అయిన సులోచన (ప్రమీల)నాగకన్య ను వివాహమాడినాడు
IndruDu ; ఇంద్రుడు , దేవేంద్రుడు -- హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, మరియు స్వర్గలోకానికీ అధిపతి. ఋగ్వేదం ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. విష్ణుమూర్తికి భూదేవికి పుట్టిన కవల పిల్లలలో ఒకడు (ఇంద్రుడు , అగ్ని ). అష్టదిక్పాలకులలో తూర్పు దిక్కునకు అధిపతి. ఇతని వాహనం 'ఐరావతం' అనే తెల్లని ఏనుగు. ఇతని భార్య శచీదేవి. వీరి కూతురు జయంతి మరియు కొడుకు జయంతుడు. ఇంద్రసభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.

Indramaala : ఇంద్రమాల -- ఒక కమల మాలిక . ఎన్నడూ వాడనిది . ఈ మాల ధరించిన వారిని ఏ అస్రమూ ఎమీ చేయలేదు .


Jatayuvu : జటాయువు -- రామాయణంలో అరణ్యకాండలో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). ఇతను శ్యేని, అనూరుల కొడుకు. సంపాతి ఈతని సోదరుడు. దశరథుడు ఇతడి స్నేహితుడు. రావణుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో పోరాడి ఓడిపోతాడు. చివరకు రాముడికి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.

Jamadagni : జమదగ్ని -- భృగు వంశానికి చెందిన మహర్షి. పరశురాముడు కి తండ్రి. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు. రేణుక ఈయన భార్య .

Janamejayudu : జనమేజయుడు -- మహాభారతంలో పరీక్షిత్తు కుమారుడు. అర్జునునికి ముని మనుమడు. వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుడు ఇతనికి మహాభారత కథను వినిపించెను. మహాభారతంలో చెప్పినట్లుగా జనమేజయుడికి ఆరు మంది అన్నదమ్మలు. వారు కక్ష సేనుడు, ఉగ్ర సేనుడు, చిత్ర సేనుడు, ఇంద్రసేనుడు, సుశేణుడు, నఖ్యశేనుడు. . తండ్రి పరీక్షిత్తు మరణించగానే జనమేజయుడు హస్తినాపుర సింహాసనాన్ని అధిష్టించాడు. తన తండ్రి మరణానికి తక్షకుడు కారణమని తెలుసుకొని సర్పములపై కోపము చెంది సర్పజాతిని సమూలంగా నాశనం చేయడానికి సర్పయాగము చేయడానికి సంకల్పించాడు. ఈ యాగం ప్రారంభం కానుండగా వ్యాస మహర్షి మిగతా ఋషులతో కలిసి వస్తాడు. కేవలం శాపాన్ని నెరవేర్చడానికి మాత్రమే తక్షకుడు పరీక్షత్తు ను చంపిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సర్పజాతినీ మొత్తం నాశనం చేయ సంకల్పించడం, పాండవుల వారసుడిగా నీకు తగదని జనమేజయుడికి హితవు పలికారు. దాంతో జనమేజయుడు ఆ యాగాన్ని ఆపు చేయించాడు.

Jaya Vijayulu : జయ విజయులు -- శ్రీ మహా విష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వార పాలకులు. వీరి గురించి భాగవత పురాణం లో ఉంది. ఒక సారి బ్రహ్మ యొక్క మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణువు దర్శనార్ధమై వైకుంఠానికి వేంచేస్తారు. వాళ్ళు వయసులో పెద్దవారైనా చూసేందుకు పిల్లల్లాగా కనిపించడంతో ద్వారపాలకులుగా ఉన్న జయవిజయులు శ్రీహరి వేరే పనులందు నిమగ్నమై ఉన్నాడనే వంకతో వారిని అడ్డగిస్తారు. దాన్ని అగౌరవంగా భావించిన సనక సనందనాదులు ఆగ్రహించి భూలోకం లో మర్త్యులై సంచరించెదరని శాపం ఇస్తారు. తనకు ఆ శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదనీ కాకపోతే రెండు ప్రత్యామ్నాయాలు మాత్రం సూచించగలనని చెబుతాడు. అప్పుడు మహా విష్ణువు వారిరువుర్నీ పలుమార్లు విష్ణుభక్తులుగా జనియించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేక మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువులుగా, ఆయనకు సమానంగా శక్తివంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారో తేల్చుకోమంటాడు. అందుకు వారు ద్వితీయ మార్గాన్నే ఎంచుకుంటారు.

Jaraasandhudu : జరాసంధుడు -- పరమ శివ భక్తుడు మరియు రాక్షసుడు. జరాసంధుడు బృహధ్రద్రుడి కుమారుడు. మగధను పరిపాలించిన మహారాజు. మహాభారతంలో సభాపర్వం లో వచ్చే పాత్ర. బృహద్రధ మహారాజు మగధని పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు భార్యల వలన సంతానం లేదు. సంతానము కోసము రాజు కోరిక మేరకు ఋషి చందకౌశిక మహర్షి ఆయనకు ఒక ఫలాన్ని ఇచ్చి, దాన్ని మహారాజు భార్య సేవిస్తే సంతానం కలుగుతుందని చెబుతాడు. (ఆ ఋషికి బృధ్రదుడికి ఇద్దరు భార్యలు ఉన్నారనే విషయం తెలియదు). రాజధాని చేరి అంతఃపురంలో ఉన్న ఇద్దరు భార్యలకు ఆ ఫలాన్ని సగ భాగం చేసి ఇద్దరికి పెడతాడు. ఆ సగ భాగాన్ని స్వీకరించిన ఇద్దరి భార్యలకు శిశువులు సగ భాగాలు జన్మిస్తారు. దీనితో దిబ్భాంత్రి లొనైన మహారాజు ఆ శిశు భాగాలను రాజధాని ఆవల విసిరి వేయమని తన సేవకులకు అప్పగిస్తాడు. సేవకులు రాజు చెప్పినట్లు రాజధాని ఆవల విసిరి వేస్తారు. అలా విసిరిన శిశువులు జరా అనే రాక్షసికి దొరుకుతారు. జరా అనే రాక్షసి ఆ శిశువులను దగ్గరకు తెచ్చి కలుపుతుండి. ఆ శిశువుకి ప్రాణం వచ్చి అరుస్తుంది. ఆ రాక్షసి శిశువుకి ప్రాణం రావడంతో తిరిగి మహారాజుకి తీసుకొని వెళ్ళి జరిగిన వృంత్తాంతాన్ని చెబుతుంది.

Jaambavanthudu : జాంబవంతుడు -- బ్రహ్మ ఆవులించగా పుట్టిన భల్లూకరాజు. కృత యుగం నుండి ద్వాపర యుగం వరకు జాంబవంతుని ప్రస్తావన ఉంది. క్షీరసాగర మధనం సమయంలోను, వామనావతారం సమయంలోను జాంబవంతుడు ఉన్నాడు. రామాయణంలో రాముని పక్షాన పోరాడాడు. కృష్ణునికి శమంతకమణిని, జాంబవతిని ఇచ్చాడు.



Kamadhenuvu-- కామధేనువు : కోరిన కోరికలు తీర్చే దివ్య శక్తులు గల గోవు


Kumaara swaami :కుమార స్వామి -  శివ పార్వతుల ఇద్దరి కుమారులలో చిన్నవాడు కుమారస్వామి. ఇతనికి ఇద్దరు బార్యలు -- శ్రీవల్లి , దేవసేన .

Katyaayini : కాత్యాయిని --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Kali : కాళి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

కాళిదాసు,Kalidasu :  ఒక గొప్ప సంస్కృత కవి మరియు నాటక కర్త. "కవికుల గురువు" అన్న బిరుదు ఇతని యొక్క ప్రతిభాపాటవాలకు నిలువెత్తు సాక్షం. గొప్ప శివ భక్తునిగా భావింపబడే కాళిదాసు, తన యొక్క కావ్యములు మరియు నాటకములు చాలావరకు హిందూ పురాణ మరియు తత్త్వ సంబంధముగా రచించాడు. కాళిదాసు అను పేరుకు అర్థం కాళి యొక్క దాసుడు.

Karnudu : కర్ణుడు -- పుట్టుకతో 'కర్ణ'కుండలాలు కలవాడు. మహాభారత ఇతిహాసములో ఒక వీరుడు. దూర్వాస మహర్షి కుంతీభోజుని కుమార్తెయైన కుంతి కి ఇచ్చిన వరప్రభావంతో సూర్య దేవునికి ఆమెకు కలిగిన సంతానము కర్ణుడు. సూర్యుని అంశాన సహజ కవచకుండలాలతో జన్మించిన కర్ణుడు సూర్యతేజస్సుతో ప్రకాశించినాడు.

kaushikudu : కౌశికుడు - ధర్మ వ్యాధునివల్ల ధర్మ విశేషాలు తెలుసుకున్నవాడు . విశ్వామిత్రునికి మరో పేరు .

Kauravulu : కౌరవులు -- కురువంశరాజులు . మహాభారతం లో దుర్యోధనాదులు వందమంది . కురువంశములో జన్మించిన వారిని కౌరవులు అంటారు. కానీ మహాభారతములో ప్రధానముగా ధృతరాష్ట్రుని సంతతిని సూచించటానికే ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. గాంధారికి జన్మించినవారు 100 మంది పుత్రులు, 1 పుత్రిక. ఒక వైశ్య వనిత ద్వారా ధృతరాష్ట్రునికి మరొక పుత్రుడు యుయుత్సుడు జన్మించాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గాంధారి పుత్రులు అందరూ మరణించారు.

Kedaareswarudu : కేదారేశ్వరుడు - శివునికి మరో పేరు . కేదారేశ్వర ఆలయము హిమాలయాలలో, గర్ వాల్ జిల్లా, ఉత్తరప్రదేశ్ - మందాకినీ నదీ సమీపంలో ఉన్నది , మంచుకారణంగా ఈ దేవాలయం సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే దర్శనమునకు తెరచి ఉంటుంది.

Kaikeyi : కైకేయి --అశ్వపతి కూతురు . దశరధమహారాజు ముడో భార్య . భరతుని తల్లి .

Kuberudu : కుబేరుడు -- హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన ఉత్తర దిక్కుకు అధిపతి అనగా దిక్పాలకుడు. ఈతని నగరం అలకాపురి. ఇతడు విశ్రవసుని కుమారుడు. ఈయన భార్య పేరు చార్వి.

Kumbhakarna : కుంభకర్ణుడు -- రామాయణం కావ్యంలో రావణుని తమ్ముడైన ఒక రాక్షసుడు. అసాధారణ బలవంతుడు, మహాకాయుడు. కుంభకర్ణుడు విశ్రవసు మనువుకు కైకసికి అసురసంధ్యవేళలొ సంభోగం వల్ల జన్మించిన సంతానం. ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు"

Kucheludu : కుచేలుడు--చినిగిన లేక మాసిన వస్త్రము కలవాడు (చేలము అనగా వస్త్రము). శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందము లో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు ,కుచేలుడు ..సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు

KamsuDu : కంసుడు -- ఉగ్రసేనుని కుమారుడు , శ్రీకృష్ణుని మేనమామ . మధురా నగరాన్ని యాదవవంశానికి చెందిన శూరసేన మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉండేవాడు. వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె దేవకిని ఇచ్చి వివాహం చేస్తారు. చెల్లెలు అంటే ఎంతో ప్రేమ కల కంసుడు ఆమెను అత్తవారి ఇంటికి రథం మీద సాగనంపుతుంటే అశరీరవాణి దేవకి గర్భం లో పుట్టిన ఎనిమిదో కుమారుడు కంసుడిని సంహరిస్తాడు అని చెబుతుంది. కంసుడు దేవకిని, వసుదేవుడిని, ఆడ్డువచ్చిన తన తండ్రి ఉగ్రసేన మహరాజును కూడా చెరసాలలో పెడతాడు

KabanduDu : కబంధుడు -- రామాయణములో రాముని చేత సంహరింపబడిన దండకారణ్యము లో ఉన్న ఓ వికృతరూపము గల రాక్షసుడు. ఈతను దట్టమయిన రోమములు గలవాడనియు, పర్వతమువంటి భీకరమైన శరీరముగలవాడనియు, తల మరియు మెడ లేనివాడనియు, ఉదరభాగమునందు క్రూరమయిన దంతములు గల నోరు గలవాడనియు, పొడవాటి చేతులు మరియు వక్షమందు ఓ పెద్ద కన్ను కలవానిగను వర్ణించిరి. కొందరు ఇతడు లక్ష్మీదేవి కొడుకుగా చెప్పిరి. ముందుగా కబంధుడు ఒక గంధర్వుడు ఒక ముని శాపముచే కబంధునకు ఆ వికృత రూపము ప్రాప్తించెను.

Kalpavrukshamu : కల్పవృక్షము -- కోరిన కోరికలు ఇచ్చే చెట్టు. ఇది దేవతలు దానవులు కలిపిచేసిన క్షీర సాగర మథనం సమయంలో పుట్టింది. దీనిని దేవతలకు రాజైన ఇంద్రుడు గ్రహిస్తాడు. బహుళ ప్రయోజనాలున్న తాటి, కొబ్బరి మొదలైన కొన్ని చెట్లను కల్పవృక్షాలుగా పేర్కొంటారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన విశిష్టమైన పద్య కావ్యము రామాయణ కల్పవృక్షం అంటారు ..

kashyapuDu : కశ్యపుడు -- ప్రజాపతులలో ముఖ్యుడు. వాల్మీకి రామాయణం ప్రకారం బ్రహ్మ కొడుకు కొడుకు(మనమడు). ఇతనికి ఇరవైఒక్క మంది భార్యలు. వీరిలో దితి, అదితి, వినత, కద్రువ, సురస, అరిష్ట, ఇల, ధనువు, సురభి, చేల, తామ్ర, వశ, ముని మొదలైనవారు దక్షుని కుమార్తెలు. ఇతనికి బ్రహ్మ, విషానికి విరుగుడు చెప్తాడు. పరశురాముడు ఇతనికి భూమినంతా దానం చేస్తాడు. ఇతనికి అరిష్టనేమి అనే పేరుంది.

Khandavam , ఖాండవం (వనము) : ఇంద్రుని వనము . అగ్నిదేవుడు ప్రార్ధించగా కృష్ణార్జునులు దానిని అతనికి ఆహారము గా ఇచ్చారు .

కృపి ,Krupi : మహాభారతంలోని పాత్ర. ఈమె కృపాచార్యుని సోదరి మరియు ద్రోణుని భార్య..

జననం-- శరధ్వంతుడు ఒక రాజు. ధనుర్విద్య ఇతనికి పుట్టుక తోనే ప్రాప్తించింది. కొంతకాలం తపస్సు చేసి అన్ని యుద్ధవిద్యల్లో ఆరితేరాడు. ధనుర్విద్యలో తిరుగులేని మహావీరుడైనాడు. ఇంద్రుడు అద్భుత సౌందర్య రాశియైన జలపది అనే దేవకన్యను ఆయన బ్రహ్మచర్యాన్ని ఆటంకపరచేందుకు నియమించాడు. మహా సౌందర్యవతి అయిన ఆమెను చూచినదే సత్యధృతి చేతిలోని విల్లమ్ములు జారి క్రిందపడ్డాయి. అది గ్రహించి తన కామోద్రేకమును నిగ్రహించుకొనెను. కాని, అతనికి రేతః పతనమై ఆ వీర్యము రెల్లుగడ్డిలో పడెను. అది రెండు భాగములై అందులోనుంచి ఒక బాలుడు, ఒక బాలిక జన్మించారు.

కొంతకాలమునకు శంతన మహారాజు వేటాడుచు అక్కడికి వచ్చి వారిని చూచి తన బిడ్డలుగా పెంచుకొన్నాడు. వారికి జాతక కర్మాది సంస్కారములు గావించి తనచే కృపతో పెంచబడ్డారు కావున వారికి కృపుడు మరియు కృపి అని నామకరణము చేయించాడు. కృపుడు విలువిద్యయందు పరమాచార్యుడై భీష్ముని ప్రార్ధనమున కౌరవ పాండవులకు గురువు అయ్యాడు. కృపిని ద్రోణాచార్యుడు పరిణయం చేసుకున్నాడు. వీరికి కలిగిన పుత్రుడే అశ్వత్థామ.

కురువంశము, Kuru Dynasty : భరతుడి తరువాత వంశం--భరతుడి కుమారుడు భుమన్యుడు, భుమన్యుడి కుమారుడు సుహోత్రుడు, సుహోత్రుడి కుమారుడు హస్తి , హస్తి పేరు తోనే ఉన్నదే అప్పటి కురురాజుల రాజధాని, ఇప్పటి ఢిల్లీ నగరమైన హస్తినాపురం. హస్తి కుమారుడు వికంఠనుడు, వికంఠనుడి కుమారుడు అజమేఢుడు. అజమేఢుడికి 124 కుమారులు. వాని కుమారులలో ఒకడైన సంవరణుడికి సూర్యుని కుమార్తె అయిన తపతికి వివాహం జరిగింది. వారి కుమారుడు కురు. కురు పేరు తోనే కురువంశం వృద్ధి చెందింది. కురు కుమారుడు విదూరధుడు. విదూరధుడి కుమారుడు అనశ్వుడు. అనశ్వడి కుమారుడు పరిక్షిత్తు , పరిక్షిత్తు కుమారుడు భీమసేనుడు. భీమసేనుడు కొడుకు ప్రదీపుడు. ప్రదీపుడి కుమారుడు శంతనుడు.

Lalitha : లలిత--హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Lankhini : లంఖిణి -- లంకను కాపలాకాసిన రాక్షసి . హనుమంతుడు లంఖిని ని హతమార్చి లంకలో ప్రవేసిస్తాడు . లంకాదహనము కావిస్తాడు .

Lavakusulu : లవకుశులు -- సీతా రాముల కవల పిల్లలు .


ManDodari : మండోదరి - పలుచని ఉదరము కలది (మండ-పలుచని). మండోదరి' రామాయణంలో రావణాసురుని భార్య. ఈమె మహా పతివ్రత. మండోదరి మాయాసురుడి కుమార్తె. రావణాసురుడు ఈమెను మోహించి అపహరించి పెళ్ళాడాడు. ఇంద్రజిత్తు ఈమెకు పుట్టిన కుమారుడు.

ManmadhuDu : మన్మధుడు - మన్మధుడు అంటే మనస్సు కలత పెట్టువాడు , మనసుని మధించేవాడని పురాణాలు వర్ణించాయి.మన్మధుడు పూవిలుకాడు. పూల బాణాలు వేసి గుండెలలో ప్రేమను పెంచును. ఈయనకు మనసిజుడు అని , అనంగుడని , పుష్పధన్యుడు అని పేర్లు ఉన్నాయి . మంచి రూపం కలిగిన వాడు. విష్ణువు కు మానస పుత్రుడు. రతీదేవి ఈయన భార్య. .

Mahishasura : మహిషాసురుడు -- హిందూ పురాణాలలో రాక్షసుడు
1. మహిషుని తండ్రి అసురుల రాజైన రంభుడు ఒకనాడు 'మహిషం' (గేదె) తో కలిసి రతిలో పాల్గొన్న మూలంగా జన్మించాడు. అందువలన మహిషాసురుడు మనిషి లాగా దున్నపోతులాగా రూపాంతరం చెందగల శక్తి కలవాడు.
2. 'మహిష్మతి' అనే ఆమె శాపం వలన మహిషమై(గేదె) ఉండి సింధు ధ్వీపుడనే రాజు రేతస్సును మింగి గర్భాన్నిధరించి మహిషాసురుడు కి జన్మనిస్తుంది. దుర్గాదేవి మహిషున్ని ఎదిరించి తొమ్మిది రోజులు తీవ్రంగా పోరాడుతుంది. పదవ రోజున ఇంతటి బలమైన రాక్షసున్ని వధిస్తుంది.

Mahishaasura mardhini : మహిషాసుర మర్ధిని -- మహిషాసురుడనే రాక్షసుడిని చంపడం వల్ల పార్వతికి ఈ పేరు వచ్చినది .

MaareechuDu : మారీచుడు : రాక్షసి తాటక కి కుమారుడు . సీతాపహరణ సమయం లో రావణుడు ఇతన్ని బంగారు జింక గా మారమని అదేశిస్తాడు ... తరువాత రాముని చే హతమార్చబడినాడు . ఇతని సోదరి కైకసి , సోదరుడు సుబాహుడు .

Menaka : మేనక -- మేనక ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. విశ్వామితుడి తపోభంగానికి ఇంద్రుడు నియమించిన అప్సరస . వీరిరువురి కలయిక వలన శకుంతల జన్మించింది .

Mohini : మోహిని -- మోహిని అంటే సాధారణంగా నారాయణుని మోహినీ అవతారము . దేవదానవులు అమృతాన్ని సాధించినతరువాత నాకంటే, నాకు అని పోరాటంచేస్తుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అందరినీ మోహించి, అమృతాన్ని పంచుతాను అని చెప్పి దేవతలకు మాత్రం ఇచ్చి రాక్షసులను మోసం చేస్తాడు. రాహుకేతువులు దేవతల వరుసలో కూర్చుంటే, వారిని తన చక్రాయుధంతో వధిస్తాడు.

ఇదే మోహినీ అవతారంలో విష్ణుమూర్తి శివుడిని కూడా మోహింపచేస్తాడు.

నకులుడు : పాండవుల్లో నాల్గోవాడు .

Naaradudu : 1.జ్ఞానమును ఇచ్చువాడు (నారమనగా జ్ఞానము) 2. కలహప్రియుడగుటచే నరసంధమును భేదించువాడు. నారదుడు - లేదా నారద ముని హిందూ పురాణాలలో తరచు కానవచ్చే ఒక పాత్ర. బ్రహ్మ మానస పుత్రుడనీ, త్రిలోక సంచారి అనీ, నారాయణ భక్తుడనీ, ముక్తుడనీ ఇతని గురించి వర్ణనలలో తరచు వస్తుంది. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సినిమాలలోనూ నారదుని కలహ ప్రియత్వం, వాక్చతురత తరచు ప్రస్తావించబడుతాయి. ఉపనిషత్తులు, పురాణములు, ఇతిహాసములలో నారదుని కధలు బహుళంగా వస్తాయి.

Parvati : పార్వతి -- హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Prahlaadudu : ప్రహ్లాదుడు - భగవంతుని దర్శనముచే అధికమైన ఆహ్లాదము పొందువాడు . ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. ఈతడు అసుర రాక్షసుడు అయిన హిరణ్యకశిపుని కుమారుడు. ప్రహ్లాదునకు దమని అనే కన్యతో వివాహము జరిగినది. వీరికి వాతాపి, ఇల్వలుడు అనే కుమారులు కలరు.


Parasuraamudu : పరశురాముడు-- శ్రీమహావిష్ణువు దశావతారములలో పరశురామావతారము (Parasurama Incarnation) ఆరవది. త్రేతాయుగము ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండ పరశువు (గండ్ర గొడ్డలి) పొంది, పరశురాముడైనాడు.

Paraasharudu : పరాశరుడు -- వసిష్టుని మనుమడు. శక్తి పుత్రుడు. ఇతని తల్లి అదృశ్యంతి. పరాశరుడు ఒకనాడు తీర్థయాత్రకు పోవుచు యమునా నదిలో పడవ నడుపుచున్న మత్స్యగంధిని చూచి మోహించెను. ఆమె కన్యాత్వము పాడవకుండా అభయమిచ్చి, శరీరపు దుర్వాసన పోవునట్లు వరం ప్రసాదించి, యమునా నదీ ప్రాంతాన్ని చీకటిగా చేసి ఆమెతో సంగమించెను. వీరికి వ్యాసుడు జన్మించెను.

Parikṣit : పరీక్షిత్తు -- అంటే అంతటా దర్శించగలవాడని అర్దము . అభిమన్యుని కుమారుడు. ఇతని తల్లి ఉత్తర. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అశ్వత్థామ ఇతనిపై బ్రహ్మ శిరోనామకాస్త్రము యోగించెను. దాని మూలంగా కలిగిన బాధనోర్వలేక ఉత్తర శ్రీకృష్ణుని ప్రార్ధించెను. ఆతని కరుణ వలన బాధ నివారణమై శిశువుగా ఉన్న పరీక్షిత్తు బ్రతికెను. ఇతడు ఉత్తరుని కూతురు ఇరావతి ని వివాహము చేసుకొనెను. ఇతని కుమారుడు జనమేజయుడు.

Puthana : పూతన --- ఒక రాక్షసి . బాలకృష్ణుని చే వధించబడుతుంది .

Pradyumnudu : ప్రద్యుమ్నుడు - ప్రకృష్టమైన (అధికమైన) బలము కలవాడు (ధ్యుమ్నము :బలము). ప్రద్యుమ్నుడు శ్రీ కృష్ణుడి కి రుక్మిణి కి జన్మించన సంతానం. ప్రద్యుమ్నుడి పాత్ర భాగవతం లొ వస్తుంది. శంభరాసురుడు అనే రాక్షుసుడిని సంహరిస్తాడు . మాయవతి (రతి దేవి) ఈయన భార్య .

PanchavaTi , పంచవటి : రాముడు వనవాస సమయం లో దండకారణ్యములోని ఆశ్రమము పేరు .

Raama : రాముడు -- హిందూ దేవతలలో ప్రముఖుడు. ఆయోధ్యా నగరం రాజధానిగా, కోసలదేశాన్ని ఇక్ష్వాకువంశపు రాజై పరిపాలించాడు . అతను పురాతన భారత దేశమును వాస్తవముగ పరిపాలించిన రాజుగా నేటి చరిత్రకారులు భావించుచున్నారు. రాముడు తన జీవితమునందు ఎన్ని కష్ఠములు ఎదురెనను ధర్మమును తప్పకుండెను. ఆ కారణము చేత రాముడిని ఆదర్శ పురుషునిగా వ్యవహరించెదరు. రాముడి తండ్రి -ధశరధుడు ,తల్లి -కౌసల్య , పినతల్లులు- సుమిత్ర ,కైకేయి , సోదరులు - భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు , భార్య -సీతాదేవి .పిల్లలు -లవ కుశలు .


Raavana : రావణాసురుడు -- కైలాసమును రావణుడు ఎత్తగా దానిని శివుడు బొటనవేలితో నొక్కినప్పుడు గొప్ప రవము (ధ్వని) చేసినవాడు అని అర్ధము . రావణుడు (Ravana) రామాయణములో ప్రధాన ప్రతినాయకుడు. రామాయణం ప్రకారం రావణుడు లంక కు అధిపతి. పది రకాలుగా ఆలోచించేవాడనే దానికి, పది విద్యలలో ప్రవీణుడు అన్నదానికి ప్రతీకగా, కళారూపాలలో రావణుని పదితలలతో చిత్రిస్తారు. పదితలలు ఉండటం చేత ఈయనకు దశముఖుడు (పది ముఖములు కలవాడు), దశగ్రీవుడు (పది శీర్షములు కలవాడు), దశ కంథరుడు, దశకంఠుడు (పది గొంతులు కలవాడు) అన్న పేర్లు వచ్చాయి. బ్రహ్మ మానస పుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రవసునికి, దైత్య రాకుమారియైన కైకసికి రావణాసురుడు జన్మిస్తాడు. కైకసికి తండ్రి సుమాలి. రావణుని భార్య ' మండోదరి ' .
రావణాసురుడి కి ఆరుగురు సోదరులు ,ఇద్దరు సోదరీమణులు, ఏడుగురు కొడుకులు . సోదరులు = 1. కుబేరుడు 2. కుంభకర్ణుడు 3. విభీషణుడు 4. ఖరుడు 5. దూషణుడు 6. అహిరావణుడు , సోదరీమణులు = 1. శూర్పణఖ(చంద్రనఖు)2.కుంభిని . కుమారులు = 1. ఇంద్రజిత్తు , 2. ప్రహస్థుడు,3. అతికాయుడు,4. అక్షయకుమారుడు,5. దేవాంతకుడు,6. నరాంతకుడు, 7. త్రిశిరుడు.

Rambha : రంభ -- ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. రూప రేఖాలావణ్యాలు గల నర్తకి . దేవలోకానికి అధిపతియైన ఇంద్రుడు భూలోకములో ఋఉషుల తపస్సు లను భగ్ననము చేయుటకు పంపే అప్సరసలలో రంభ ఒకతె . రంభ , కుబేరుని కొడుకు అయిన 'నలకుబేరుని' భార్య ..

Radha : రాధ లేదా రాధిక -- శ్రీకృష్ణుని ప్రియురాలు , నందుని చెల్లెలు . కొందరు వైష్ణవులు రాధను శక్తి అవతారంగా భావిస్తారు. భారతదేశంలో రాధాకృష్ణులకు చాలా దేవాలయాలు ఉన్నాయి. రాధాకృష్ణులను ప్రేమకు చిహ్నాలుగా ఎంతోమంది కవులు, చిత్రకారులు కొన్నిశతాబ్ధాలుగా వర్ణిస్తూ, చిత్రీకరిస్తూనే వున్నారు..

Rathidevi : రతీదేవి --దక్ష ప్రజాపతి కూతురు . మన్మధుని భార్య , మన్మథుడు లోకాలన్నిటినీ మోహింప చేయగల శక్తి ఉన్నవాడు. అలాంటి మన్మథుడినే మోహింప చేయగల శక్తి ఉన్న అతిలోక సర్వావయవ సౌందర్యవతి రతీదేవి. ఈ ఇద్దరికీ వివాహం ఎప్పుడు ఎలా అయింది? అనే విషయాన్ని కామ వివాహం అనే పేరున శివపురాణం రుద్ర సంహితలోని మూడు, నాలుగు అధ్యాయాలు వివరిస్తున్నాయి. మన్మథుడు బ్రహ్మ మనస్సు నుంచి జన్మించిన తర్వాత ఆ బ్రహ్మ దేవుడు తనతో సహా అందరినీ మోహింప చేయగల శక్తిని మన్మథుడికి అనుగ్రహించాడు.

Renuks : రేణుక --రేణుక భృగు వంశానికి చెందిన మహర్షి జమదగ్ని భార్య,. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు.. భృగు మహర్షి వీరి వంశానికి మూల పురుషుడు.

Revathi : రేవతి -- ఒక నక్షత్రము . దక్షప్రజాపతి కూతురు . చంద్రుని భార్య , భార్యలందరిలో రేవతి అంటే చంద్రునికి మిక్కిలి ప్రేమ .


Rukmini : రుక్మిణి - రుక్మము(బంగారము) కలది. రుక్మిణీ దేవి శ్రీ కృష్ణుడి ఎనమండుగురి భార్యల లొ పెద్ద భార్య. ఈమెను లక్ష్మీ దేవి అంశగా హిందువులు నమ్ముతారు. రుక్మిణీ దేవికి సంబంధించిన కథలు మహా భాగవతము దశమ స్కందము లొ వస్తుంది. విదర్భ దేశాన్ని భీష్మకుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు, ఆ రాజు కి రుక్మి, రుక్మరత, రుక్మకేతు, రుక్మబాహు, రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు. వీరికి రుక్మిణీ అనే సోదరి ఉన్నది. రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు .


RushyamUkamu : ఋష్యమూకము -- అన్న వాలి చే తరుమబడి సుగ్రీవుడు తలదాచుకున్న కొండ . తన తల వేయి ముక్కలవును అనే ముని శాపము తో వాలి ఈ కొండ దరిదాపులకు రాడు . 

 Shakti : శక్తి --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Sambudu : సాంబుడు -- జాంబవతి , శ్రీక్రిష్ణులకు జన్మించిన కుమారుడు .

Satyabhama - సత్యభామ : శ్రీకృష్ణుని భార్య సత్యభామ , ఈమె తండ్రి సత్రాజిత్తు (సత్రాజిత్తు ను శతధన్వుడు అనేవాడు సంహరించి శమంతక మణిని చేజిక్కించుకున్నాడు. శమంతక మణిని అపహరించుకుపోవటమేకాకా తన మామ అయిన సత్రాజిత్తును సంహరించిన శతధన్వుడిని శ్రీకృష్ణుడు హతమార్చెను .

Syaama : శ్యామ --హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Shakuntala : శకుంతల -- మేనక, విశ్వామిత్రుల సంతానము. దుష్యంతుని భార్య మరియు భరతుని తల్లి. విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయడానికి ఇంద్రుడు మేనక ను పంపిస్తాడు. మేనక చేత ఆకర్షితుడైన విశ్వామిత్రుడు తపస్సు నుండి రతిక్రీడ లోకి మారతాడు. రతిక్రీడ ఫలితంగా మేనక గర్భవతి అవుతుంది. విశ్వామిత్రుడు బయటి వాతావరణం చూసి శిశిర ఋతువు అవడం గ్రహించి తపోభంగం జరిగిందని గ్రహించి, మేనకను అక్కడ నుండి పంపివేస్తాడు. మేనక ఆడబిడ్డను ప్రసవించి, ఇసుక దిబ్బ మీద విడిచి, వెళ్ళిపోతుంది. అలా విడిచిన బిడ్డను పక్షులు తమ రెక్కలతో రక్షిస్తాయి. ఆ మార్గములో వెళ్ళుతున్న కణ్వ మహర్షి ఆ బిడ్డను చూసి పక్షుల రెక్కల చేత రక్షింపబడడం వల్ల శకుంతల అని పేరు పెట్టి, తన ఆశ్రమంలో పెంచి పెద్దచేస్తాడు.

Shantanudu : శంతనుడు -- శం = సుఖము/శుభము తను = విస్తరింపజేయుట , సుఖమును, శుభమును విస్తరింపజేయువాడు. అని అర్దము . శంతనుడు మహాభారతంలో హస్తినాపురాన్ని పరిపాలించిన సూర్యవంశానికి చెందిన రాజు. భరతుడి వంశక్రమానికి చెందినవాడు. పాండవులకు మరియు కౌరవులకు పూర్వీకుడు. హస్తినాపురానికి రాజైన ప్రతీపునికి వృద్ధాప్యంలో జన్మించిన కనిష్ట పుత్రుడు

Shasti Devi : షస్టీదేవి -- మూల ప్రకృతిలోని అరోభాగం నుంచి జన్మించిన దేవత .

Shivagamga : శివగంగ -- బ్రహ్మ మానస పుత్రుడైన అంగీరసుడి భార్య .

Shurabhi : సురభి -- దేవతల గోవు

శకుని -Shakuni :     గాంధార  రాజైన సుబలుని కుమారుడు . సుబలుడు తన కుమార్తెలైన గాంధారి , సత్యసేన , సత్యవ్రత మొదలైన వాళ్ళను ధృతరాష్ట్రునకు ఇచ్చి వివాహము చేసాడు . శకుని మహాభారతంలో గాంధారి కి తమ్ముడు. దుర్యోధనుని మేనమామ. ఇతనికి ఇద్దరు సోదరులు వృషకుడు, అచలుడు. ఇతని కొడుకు ఉలూకుడు.

శకునిని అతని అన్నలనూ కౌరవులు ఒక చెరసాలలో బంధించి, వారికి రోజూ ఒక్క మనిషికి సరిపోయే ఆహారం మాత్రం ఇస్తారు. కౌరవుల మీద ఎలా ఐనా ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్న శకుని సోదరులు, తమ భాగం ఆహారాన్ని కూడా శకుని కి ఇచ్చి, తమ పగ తీర్చమని చెప్తారు.

దుర్యోధనుని దురాలోచనలకు ఇతడు సహాయం చేస్తుండేవాడు. ఇతడే ధర్మరాజుని మాయా జూదంలో ఓడించినది. వనవాసము చేయుచున్న పాండవులను ఏదో విధంగా చంపమని బోధించినది కూడా ఇతడే. కురుక్షేత్ర సంగ్రామంలో ఇతన్ని నకుల సహదేవులు సంహరించిరి.

Tapati : తపతి -- సూర్యుని కుమార్తె . -- సంజ్ఞ రూపంలో చాయ సూర్యుడికి చాలాకాలం సేవలు చేసింది. ఆమెకు సూర్యుడి వల్ల శనీశ్వరుడు, తపతి కలిగారు. తపతి అందాల బొమ్మ, సుగుణాల ప్రోగు. ఆమెకు యుక్త వయస్సు వచ్చేసరికి మరింత అందంగా తయారైంది. సూర్యుడు కుమార్తెకు పెళ్ళిచేయాలని నిశ్చయించుకున్నాడు. తగిన వరుడికోసం అన్వేషిస్తున్నాడు. చంద్రవంశ రాజు ఋక్షుని కుమారుడు సంవరణుడు తో ప్రతిష్ఠానపురంలో వారిద్దరి వివాహం వశిష్టుడి ఆధ్వర్యంలో అతి వైభవంగా జరిగింది. ఆ దంపతులకు కురు వంశానికి మూలపురుషుడైన 'కురువు' జన్మించాడు. వింధ్య పర్వతాలకు పశ్చిమంగా ప్రవహించి ప్రజల పాపాలు పోగొట్టమని భాస్కరుడు తన కుమార్తెను దీవించాడట. తండ్రి ఆశీస్సును అనుసరించి తపతీదేవి నదీమతల్లిగా మారి నర్మదానదిలో లీనమై ప్రవహిస్తోంది.

Taara : తార -- తారుని కుమార్తె . వాలి భార్య . అంగదుని తల్లి . వాలి మరణించిన అనంతరము తనను కూడా చంపి భర్త దగ్గరకు పంపమని తార రాముని ప్రాధేయపడింది. కాని అది వీలుపడదని కర్మా-ధర్మాలను అనుభవించవసిందేనని తాను నిమిత్తమాత్రుడునని హితవు పలికెను . వాలి సోదరుడు ' సుగ్రీవుడు ' ఈమెను వివాహమాడెను .

Taataki : తాటకి -- లేదా తాటక రామాయణ ఇతిహాసంలో కనిపించే ఒక యక్ష రాక్షసి పేరు. ఈమె వివిధ రూపాలలోకి మారగలదు. ఈమె తండ్రి యక్షరాజైన సుకేతుడు పిల్లల కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ ఇతని తపస్సుకు మెచ్చి అతను కొడుకును కోరుకున్నా ఒక బలమైన మరియు అందమైన కూతుర్ని ప్రసాదించాడు. ఈమె రాక్షస రాజైన సుమాలి ని పెళ్ళిచేసుకుంటుంది. వీరిద్దరికి కలిగిన పిల్లలే సుబాహుడు, మారీచుడు మరియు కైకసి. వీరిలో కైకసి విశ్రావసుని వలన రావణుడు, విభీషణుడు మరియు కుంభకర్ణుల్ని పుత్రులుగాను, శూర్పణఖ అనే పుత్రికను పొందుతుంది.

Tumburudu : తుంబురుడు - తుంబుర (వాద్య విశేషము) కలవాడు. గందర్వుడు , విష్ణు భక్తుడు మరియు దేవగాయకుడు . నారదుని తో పోటాపోటి గా నిలిచి నారద-తుంబురులు గా ప్రసిద్ధిగాంచిరి .

Trishankudu : త్రిశంకుడు - 1. తండ్రిని ఎదిరించుట 2, పరభార్యను అపహరించుట 3. గోమాంసము తినుట అను మూడు శంకువులు(పాపాలు) చేసినవాడు. ఇక్ష్వాకు వంశానికి చెందిన సత్యవంతుడు అనే మహారాజు, కులగురువులైన వశిష్ఠుడి తో వైరం నొంది వశిస్టుని కుమారులచే శపించబడి చండాలరూపాన్ని పొంది , విశ్వామిత్రుని ఆశ్రయించి త్రిశంకుస్వర్గము ( విశ్వామిత్రుని చే సృస్టించబడినది )నకు రాజైయ్యాడు .

Urvashi : ఊర్వశి - ఊరువు (తొడ) నుండి ఉద్భవించినది. ఇంద్రుని సభలోని అప్సరసలలో ఒకరు. పూర్వం విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి రంభ ను దేవేంద్రుడు పంపుతాడు. రంభ విశ్వామిత్రుడు తపస్సు ను భంగం చేయడానికి ప్రయత్నిస్తుండగా, విశ్వామిత్రుడు రంభ గర్వమనచడానికి తన ఉర్వుల నుండి ఒక అందమైన స్త్రీ ని సృష్టించాడు. ఆమె ఊర్వశి. విశ్వామిత్రుడు ఊర్వుల నుండి జన్మించింది కనుక ఊర్వశి అయింది.

Uttara : ఉత్తర -- విరాటరాజు కుమార్తె. ఉత్తరుడు ఈమె సహోదరుడు. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. అర్జునుడు తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న నాట్యము ఉత్తరకు నేర్పించాడు. తరువాత అర్జునుడు ఉత్తరను తన కుమారుడు అభిమన్యునితో వివాహము చేసాడు. అభిమన్యుడు పిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అభిమన్యుడు మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉన్నది. ఆమెకు పుట్టిన కుమారుడు పరీక్షిత్తు. యధిష్టురుని తరువాత హస్తినాపురానికి పరీక్షిత్తు రాజు అయ్యాడు.

UttaruDu : ఉత్తరుడు -- విరాట రాజ్యానికి రాజైన విరాటరాజు కు ఇతని భార్య సుధేష్ణ కు పుట్టిన కుమారుడు . ఉత్తర ఈయన సహోదరి .

Urmila : ఊర్మిళ -- రామాయణంలో దశరథుని కోడలు మరియు లక్ష్మణుని భార్య. సీతారాములతో లక్ష్మణుడు వనవాసాలకు పోయిన తరువాత, అతనికి శ్రీరామ సంరక్షణార్ధం నిద్రలేమి కలిగింది. అందువలన ఊర్మిళ ఆ పదునాలుగు సంవత్సరాలు నిదురపోయిందని అంటారు. ఆధునిక కాలంలో ఎక్కువసేపు నిద్రపోయే వారిని ఊర్మిళాదేవితో పోలుస్తారు.

Uma : ఉమ - పార్వతి ( Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

Usha : ఉష -- వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని కూతురే ఉష . శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు ఈమె భర్త. వీరి కుమారుడు వజ్రుడు. బాణాసురుని వంశపరంపర-> * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.

ushana : ఉశన -- భృగువు భార్య , శుకృడి తల్లి .
Uluchi : ఉలూచి -- నాగకన్య . వాసుకి కుమార్తె . అర్జునుడు ఈమె ద్వారా ' ఇలావంతుడు ' ని జన్మనిస్తాడు .

Vigneswarudu :  విఘ్నేశ్వరుడు - శివ పార్వతుల ఇద్దరి కుమారులలో పెద్దవాడు విఘ్నేశ్వరుడు , గణేషు , గనపతి అని అనేక పేర్లు ఉన్నాయి. ఇతనికి ఇద్దరు భార్యలు సిద్ధి , బుద్ధి .


vaalmiki : వాల్మీకి - నిరాహారుడై తపస్సు చేయగా వాని శరీరముపై వల్మీకములు (పుట్టలు) మొలచుటవలన వాల్మీకి అయ్యాడు. వాల్మీకి సంస్కృతంలో ఆదికవి. రామాయణాన్ని వ్రాశాడు. వాల్మీకి ముని పూర్వపు నామధేయం అగ్ని శర్మ, తండ్రి ముని ప్రచితాస(Prachetasa sage) .అతి చిన్నవయసులో అడవిలో తప్పిపోయి రత్నాకరుడు గా ఒక బోయవాని దగ్గర పెరిగి పెద్దవాడయ్యాడు పెంపుదు తల్లిదండ్రులు కౌశికి, సుమతి.

Vedi : వేది -- బ్రహ్మ దేవుని భార్య ;

VyaasuDu : వ్యాసుడు - వేదాల్ని వ్యాసం (విభజించి వ్యాప్తి చేయుట) చేసినవాడు. హైందవ
సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడు గా పిలువబడే వాడు వ్యాసుడు. వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు ఉపవేదాలు , 555 బ్రహ్మసూక్తులు , 108 ఉపనిషత్తులు , మహాభారతం, మహాభాగవత తో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు. ఈయన తండ్రి ' పరాశరుడు ', తల్లి ' సత్యవతి ' . వశిష్టవంశము వాడు .

Vidhura : విదురుడు - బుద్ధిమంతుడు , తెలివిగలవాడు. విదురుడి జననం--కురువంశాన్ని నిలపడానికి సత్యవతి తన కోడళ్ళైన అంబిక ని, అంబాలిక ని దేవరన్యాయం ప్రకారం ధర్మ సమ్మతంగా సంతానం పొందించే ఏర్పాటు చేస్తుంది. అంబిక వ్యాసుడిని చూసి కళ్ళు మూసుకొనడం వల్ల గుడ్డివాడగు ధృతరాష్ట్రుడు జన్మిస్తాడు. అంబాలికకు వ్యాసుడిని చూసి కంపించడం(pale) వల్ల పాండు రోగంతో పాండు రాజు జన్మిస్తాడు. మంచి వారసత్వాన్ని ఇవ్వమని కోరితే వ్యాసుడు మళ్లీ దేవరన్యాయం వల్ల అంబిక కి సంతానం కలిగించడానికి అంగీకరిస్తాడు. గడ్డాలు గల వ్యాసుడితో సంభోగించడానికి ఇష్టం లేని అంబిక తన దాసిని వ్యాసుడి వద్దకు పంపుతుంది.ఈ విధంగా పంపబడిన దాసి ఎంతో సంతోషముతో వ్యాసుడితో సంభోగిస్తుంది. దాసితో సంభోగించగా జన్మించిన వాడు విదురుడు.

Vibhishana : విభీషణుడు - దుష్టులకు విశేష భీతిని కలిగించువాడు అని అర్దము . రామాయణంలో ఒక ముఖ్య పాత్ర. రావణ, కుంభకర్ణు లు విభీషణుడి అన్నలు. ఇతని భార్య పేరు ' సరమ ' . రావణ సంహారము తర్వాత లంక కు రాజు అయ్యాడు .

Viswarupudu : విశ్వ రూపుడు -- విశ్వకర్మ కుమారుడు , సూర్యుని 
కుమార్తె ' విష్టి ' ఇతని భార్య .


విశ్వామిత్రుడు ,Viswamitra : హిందూపురాణ గాధలలో ఒక ఋషి. రాజర్షిగాను, మహర్షిగాను, బ్రహ్మర్షిగాను వివిధ రామాయణ, భారత, భాగవతాది గాధలలో విశ్వామిత్రుని ప్రస్తావన ఉన్నది. విశ్వామిత్రుని గురించిన గాధలలో ప్రధానమైనవి:

        గాయత్రీ మంత్ర సృష్టి కర్త
        శ్రీరామున కు గురువు.
        హరిశ్చంద్రుని పరీక్షించినవాడు.
        త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు
        శకుంతలకు తండ్రి. ఆ విధంగా భరతునకు తాత.


Yama : యముడు , యమధర్మరాజు - యమము (లయ)నుపొందించువాడు. యముడు లేదా యమధర్మరాజు హిందూ పురాణాలలో తరచు కనవచ్చే ఒక పాత్ర. నరక లోకానికి అధిపతి. సూర్యుని కుమారుడు. పాపుల పాపములను లెక్క వేయుచూ, సమయము ఆసన్నమైనపుడు ప్రాణములు తీయుట యముని పని. కాలుడు అని మరియొక పేరు . యముడు దక్షిణ దిశకు అధిపతి, గొప్ప జ్ఞాని, భగవద్భక్తుడు. నచికేతునికి ఆత్మ తత్వ జ్ఞానం ఉపదేశించాడు (కఠోపనిషత్తు). తన దూతలకు భగవంతుని మహాత్మ్యాన్ని వర్ణించాడు (స్కంద పురాణము). యముని వద్ద పాపుల పద్దులను లెక్కించుటకు చిత్రగుప్తుడు అను సహాయకుడు ఉంటాడు. * భార్య పేరు ' శ్యామల * సోదరులు : వైవస్వతుడు, శని * సోదరీమణులు: యమున, తపతి

Yashoda : యశోద -- యశస్సును (కీర్తి) కలిగించునది. భాగవతము లో యశోద నందుని భార్య గోకులవాసి .. శ్రీకౄష్ణుని పెంపుడు తల్లి . బలరాముడు , సుబద్రలు ఈమె వద్దనే పెరిగేరు . యశోదా-నందులకు ' ఏకనంగా ' అనే సొంత కూతురు ఉందటారు .

YaagyavalkuDu :యాజ్ఞవల్కుడు -- ప్రాత:స్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఈయన భాష్కలుని వద్ద ఋగ్వేదము,జైమిని వద్ద సామవేదము అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించారు. వైశంపాయుని వద్ద యజుర్వేదాద్యయనము కూడా చేసాక విద్యాహంకారము కలిగి గురుశాపానికి గురై తాను నేర్చుకున్న వేదజ్ఞానమంతా రుధిర రూపము లోగక్కి శాపాన్ని బాపుకున్నారు. ఆయన గక్కిన పదార్దాన్ని తిత్తిరిపక్షులు తిని తిరిగి అవి పలుకగా ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్దికెక్కాయి. ఆతరువాత యాజ్ఞవల్కుడు సూర్యభగవానుని ఆరాధించి ,శుక్లయజుర్వేదాన్ని నేర్చుకొని గురువుకన్నా గొప్పవాడయ్యాడు. సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాదించాడ. తరువాత కాత్యాయిని అనే ఆమెను వివాహము చేసుకున్నాదు. గార్గి శిష్యురాలైన మైత్రేయి యాజ్ఞవల్కుని తప్ప మరొకర్ని వివాహము చేసుకోనని శపధముచేసి , కాత్యాయిని స్నేహము సంపాదించి ఆమె సమ్మతితో యాజ్ఞవల్కుని రెండవ భార్య అయినది. మహాజ్ఞాని,తపోనిధి, అయిన యాజ్ఞవల్కునికి మాఘ శుద్ద పౌర్ణమినాడు యోగీంద్ర పట్టాభిషేకము చేసారు. ఆయన ఋషులకు తెలియజేసిన విషయాలే యోగశాస్త్రమని,యోగయాజ్ఞవల్కమని ప్రసిద్ధికెక్కాయి. కర్మజ్ఞానము వలన మోక్షము కలుగుతుందని తెలియజేసిన ప్రా:స్మరణీయుడు యాజ్ఞవల్కుడు .ఆయన జయంతి రోజు నాడు ఆయన్ని ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది.

YudhisturuDu :యుధిష్టిరుడు -- ధర్మరాజు కు యుధిష్టిరుడని మరొక పేరు , మహాభారతము లో పంచపాండవులలో మొదటివాడు . . సత్యము, అహింస మొదలగు ధర్మములను పాటించే రాజు. కుంతి భర్త అనుమతి పొంది ధర్ముని వలన(యమధర్మరాజు) కన్న సంతానము కనుక ధర్మజుడని, యుద్ధమునందు స్థిరమైన పరాక్రమమును ప్రదర్శించువాడు కనుక యుధిష్టిరుడని పేర్లు కలిగాయి. జూదము లో ఓడిపోయి విరాట కొలువులో కంకుభట్టు గా ఉంటాడు .